హిందూ సనాతన ధర్మము

ఆచారా పరమో ధర్మః అన్నారు. సనాతన ధర్మము ఇన్ని వేల సంవత్సరాల కాలం నిలిచి ఉండడానికి కారణం ఈ సూత్రమే మూలము అనుకుంటాను. సమాజములోని వివిధ జనులు  వారికి సనాతనము నుండి వారసత్వముగా వస్తున్న వారి సాంప్రదాయములు, కట్టుబాట్లు, ఆచారములను వారికి వారు పాటించుకొనవలెను. ఎవరిమీద మతపరమయిన ఆంక్షలు ఎప్పుడూ లేవు….( ఈ పాఠము నేను పరిశోధించి రచించిన “పాచీన భారతీయులకు అక్షర సుమాంజలి ” అను పుస్తకములోనిది. అధ్యాయము  25,  సనాతన ధర్మము’)

​. . . మన ప్రాచీన సమాజములో గాని ఒక వంద సంవత్సరములకు పూర్వమువరకు ధర్మములను నిర్వచించాల్సిన అవసరము వచ్చినప్పుడు  ధర్మశాస్త్రములు తెలిసిన పండితుల సహకారము తీసుకుని తీర్పులు చెప్పేవారు. దేశ కాలమాన పరిస్థుతులను బట్టి ధర్మము మారుతుంది.

కాలానుగుణముగా ధర్మము యొక్క నిర్వచనమును మార్చే గుణము భారతీయ సమాజముయొక్క విశిష్టత. అలాగే క్రొత్త జనులు వచ్చి  చేరినపుడు వారి వారి సాంప్రదాయములను కట్టుబాట్లను వారు కొనసాగించుకునే విధముగా  వారికి తగిన వసతి చూపించడము భారతీయ సాంప్రదాయము.

సనాతన ధర్మము

భారతీయ సమాజమునకు గల ఈ మానవత్వపు ధోరణి  ఇక్కడకు వలస వచ్చిన ఎవ్వరినైన మంత్రముగ్దుల్ని చేస్తుంది. కొన్నాళ్ళకి వారు సనాతన ధర్మమునకు ఆయువుపట్టుగా మారతారు. దీనికి ఉదాహరణములు చాలా ఉంటాయి. విఘ్నేశ్వరుడు యక్షజనులకు సంబందించినవాడు. అతను తొలుత దేవీ ఆలయము బయట కాపలాదారుగా పనిచేసి తరువాత సనాతనధర్మములో ప్రధాన దైవము అయ్యాడు. రావణుడు యక్షగంధర్వ జనులనుండి వచ్చి తొలుత రుద్రుడుగా పనిచేసి తరువాత రాజ్యాధికారము చేజిక్కించుకొని రాజాధిరాజు అయ్యాడు.

photo 2 1
“ప్రాచీన భారతీయులకు అక్షర సుమాంజలి (వేద కాల సమాజము)

నేను రచించిన ఈ “ప్రాచీన భారతీయులకు అక్షర సుమాంజలి (వేద కాల సమాజము)” అను పుస్తకము యొక్క విశేషములు తెలియజేసే పేజీ లోకి వెళ్ళడానికి, పుస్తకము కొనడానికి బుక్ ఫోటో పై క్లిక్ చెయ్యండి. వెల రు. 499/-

లేదా

పుస్తకమును అమెజాన్ ద్వారా కొనుగోలు చేయుటకు ఈ లింకు పై క్లిక్ చెయ్యండి. https://www.amazon.in/dp/B0CTSP19X3?ref=myi_title_dp

తనదైన శైలిలో బ్రహ్మలను పోషించాడు. అశోకుడు తాను బౌద్ధమతాభిమాని అయినను భౌద్ధ వ్యతిరేక శాఖవారయిన అజీవకులకు దానములు ఇచ్చాడు. ఆధునిక యుగములో కూడా ఈ సాంప్రదాయము కొనసాగుతూనే ఉంది. ఔరంగజేబు కాశీ లోని ఒక ఆలయములో కృష్ణుని విగ్రహము తయారుచెయ్యడానికి బంగారము దానము ఇచ్చాడు. టిప్పుసుల్తాను శ్రింగేరి మఠములో సరస్వతీ దేవి విగ్రహము తయారుచెయ్యడానికి బంగారము దానము ఇచ్చాడు. 1985 వరకు ఇంగ్లేషువారుకూడా..

నా వీడియోలను యుట్యుబ్ లో తిలకించండి

బ్రహ్మావర్తము

ఆర్యజాతి వాదము

సరస్వతి నది ఆచూకీ

 హిందూ మతమును ఉద్ధరించడానికే భారతదేశములో ఉంటున్నాము అని చెప్పుకునేవారు. ​……ఒక గృహస్తుని యొక్క భార్యల సంఖ్యవిషయములో ఆంక్షలు ఎక్కడా సూచించలేదు. కాని కామమును నిగ్రహించుకోవడము అనే అంశము సామాజిక విలువలలో ఆదర్శప్రాయమయి ఉన్నది. అందుచేత ఏక పత్నీ ఆచారము గృహస్తులకు పరోక్ష నియమము. …దేవీ ఆరాధన సనాతన ధర్మము. రుద్రులు బ్రహ్మను కాపాడడము సనాతన ధర్మము. బ్రహ్మ దేవీ ఆరాధనను విస్తృతపరచడము సనాతన ధర్మము. దేవి పేర్లు మారతాయిగాని దేవిల ఆరాధన  నిరంతరము కొనసాగుతుంది. దేవి అంటే ఆమె ఎవ్వరికి భార్యకాదు. ఈ రోజుకి దేవి ఆలయములలో ఎక్కడాకూడా ఆమెకు తోడుగా మగదేవతల విగ్రహములు గాని బొమ్మలుగాని నిలపరు. దేవి సర్వవ్యాపి. సర్వ శక్తికి మూలము. అందుచేత ఆమెకు మగదేవతల సహకారము అక్ఖరలేదు. ఆమె నిరంతర కన్య. ఆమెకు పిల్లలు ఉండరు. కాని ఆమె అందరికి తల్లి,విశ్వమాత. ఇదే సనాతన ధర్మము…..

….శుక్రాచార్యుని ఎప్పుడూ ఋషి అని సంబోధించరు. విశ్వామిత్రునిలా అతను తపస్సు చేసి బ్రహ్మ కావాలని ఆశించలేదు. కాని అతను సకల విద్యలలోను నిష్ణాతుడు. అతనికి మృత సంజీవిని విద్య తెలుసు. కాని అతను సనాతన ధర్మములోని పరమార్ధము గ్రహించలేకపోయాడు. విశ్వామిత్రునిలా బ్రహ్మ‌ఋషి కాలేకపోయాడు. అందుచేతనే అతనిని హ్రస్వ దృష్టిగలవానిగా పురాణములు చూపిస్తున్నాయి.

    బ్రహ్మలు, నరులు దాశుషేలు దేవీలను ఆరాధిస్తుంటే చూసి వీరందరు ధనముకోసము దేవీలను ఆరాధిస్తున్నారని భావించి కుబేరుడు లక్ష్మి దేవిని మాత్రము ఆరాధించాడు. ఫలితముగా ఒక కన్నును పోగొట్టుకున్నాడు. ఈ హ్రస్వ దృష్టిని ప్రతిబింబించే విధముగా శిల్పకారులు అతని ముఖము ఒక ప్రక్కకు వంగియున్నట్లు మలచుతారు. అలాగే భృగు మహర్షికి అతని తెలివి తలలో లేదు కాలిలో ఉంది అని చెప్పడానికి విష్ణువు కాలిలో‌ఉన్న కంటిని చిదిమే కథనము చెబుతారు. ఈ కథనములను బట్టి సనాతన ధర్మమును అందరు అర్థముచేసుకోలేదని ఎవరి కోణములో వారు ఆలోచించి అవగాహనలోపమువలన  విపరీత లేక వక్ర భాష్యములు చెప్పియున్నారని మనము గ్రహించవచ్చు. …..

ఉత్తరీయము

ఇక మన ప్రీష్ట్ కింగ్ ఎడమ భుజముపై కప్పుకున్న వస్త్రము విషయము చూద్దాము. మనుస్మృతిలో ఉత్తరీయ ధారణ నియమము గురించి ఏమని చెప్పారో ఈ క్రింది శ్లోకములలో విశదమవుతుంది.

ఆగ్న్యగారే గవాం గోష్ఠే బ్రాహ్మణానాం చ సన్నిధౌ

స్వాధ్యాయే భోజనే చైవ దక్షిణం పాణిముద్ధరేత్

 “యాగశాలయందు, పసులకొట్టమునందు, బ్రాహ్మణుల సన్నిధియందు, వేదాధ్యయన సమయమునందు, భోజన కాలమందును గుడిచేతి ని ఉత్తరియమునకు వెలుపలిగా నుంచుకొనవలయును.”

ఈ క్రింది అంశములు నేను పరిశోధించి రచించిన “ప్రాచీన భారతీయులకు అక్షర సుమాంజలి” అను గ్రంధములోని 4 వ  అధ్యాయము, ’ బ్రహ్మ ప్రజాపతి ’ లోనివి అని గ్రహించవలెను.

నిత్యముద్ధృతహ స్తస్స్యాత్సాధ్వాచారస్సుసంయత:

ఆస్యతామితి చోక్తస్సన్నాసితాభిముఖం గురో:

    “బ్రహ్మచారి (విద్యార్ధి) ఎల్లప్పుడు తన‌ఎడమ చేతిని ఉత్తరీయముతో కప్పుకొనవలెను. కుడిచేతిని, కుడిభుజమును దేనితోనూ కప్పకుండా ఉంచవలెను. బ్రహ్మచారి ఎప్పుడూ గురువుల‌ఎదుట కూర్చొనకూడదు, గురువు కూర్చోమనిన తరువాత మాత్రమే కూర్చొనవలెను.”       బ్రహ్మచారులు, ప్రజాపతులే కాకుండా వైశ్యులు, గోపాలురు కూడా ఈ ఉత్తరీయ ధారణను పాటించేవారని పై శ్లోకములవలన తెలుస్తుంది.

ఎల్లప్పుడు కుడిచేతిని, కుడి భుజమును ఖాళీగా ఉంచి అనగా ఉత్తరీయముతో కప్పకుండా ఉండేటట్లు జాగ్రత్త పడవలెననేది నియమము. అయితే ఉత్తరీయము ఏ రకమయిన వస్త్రముతో తయారుచేసేవారు అనేది మరో అంశము. ఈ క్రింది శ్లోకము చూడవలెను,

నా ఈ వ్యాసాలను కూడా చదవండి

 బ్రహ్మచర్యేతి సమిధా సమిధ్ధః కార్ష్ణం వసానో దీక్షితో

    బ్రహ్మచారి తన విద్యాభ్యాసము పూర్తి అయిన తరువాత గురువు యొక్క అనుమతితో కృష్ణాజినము (ఉత్తరీయము) విసర్జించి గృహస్థాశ్రమములో చేరవలెను. అనగా బ్రహ్మచారులు కృష్ణాజినమును ఉత్తరీయముగా వాడే అలవాటు ఉందని విశదమవుతుంది. అలాగే శ్రీ రాముడు తొలుత నార వస్త్రములు ధరించి వనములకేగినట్లు రామాయణములో ఉంటుంది. కాని శూర్పనఖ తారసపడే సమయానికి రామ లక్ష్మణులు కృష్ణాజినములు ధరించి ఉంటారు. అనగా పెద్దరికము వచ్చినపుడు, తపోధనము సంపాయించిన తరువాత బ్రహ్మచారులు  కృష్ణాజినము ధరించే అర్హత పొందుతారు. అలాగే ప్రజాపతులకు కృష్ణాజినము ధరించడము సామాన్యము కావచ్చు.

…..సామాన్యులు దైవాంశ సంభూతులయిన ఋషులను, బ్రహ్మచారులను గౌరవించడము మరియు సేవించడము ద్వారా సనాతన ధర్మ విశిష్టతను అవగాహన చేసుకోగలరు, అలాగే పుణ్యమును దైవకృపను పొందగలిగేవారు. మరో కోణములో ధర్మవ్యాధుడు మాతా పితరుల సేవ ద్వారా మహాత్ముడయి సనాతన ధర్మమును నిలబెట్టాడు. ఇదియే సనాతన ధర్మము.

త్రి‌ఋణములు

   ప్రతీ వ్యక్తి త్రి‌ఋణ సిధ్ధాంతమును నమ్ముతాడు. ఒక వ్యక్తి జన్మించేటప్పుడు జన్మతోపాటు మూడు ఋణములను కూడా తెచ్చుకుంటాడు. అవి ఒకటి పితృ ఋణము, రెండు దైవ ఋణము మూడవది ఋషి ఋణము.

Vishnu (left) gives away his sister and bride Meenakshi's hand into the waiting hand of groom Shiva
Vishnu (left) gives away his sister and bride Meenakshi’s hand into the waiting hand of groom Shiva
(Picture courtesy: Richard Mortel from Riyadh, Saudi Arabia)

సంతానము బడసి వారికి సనాతన ధర్మమును ఆచరించే ప్రవృత్తి నేర్పి ఒక వ్యక్తి అలా తన యొక్క పితరుల వంశాభివృద్దిగావించి పితృ ఋణమునుంచి విముక్తుడవుతాడు. యజ్ఞములు చెయ్యడము, వాటి నిర్వహణకు సహకరించడము ద్వారా దైవ ఋణమునుంచి విముక్తుడవుతాడు. వేదములు అభ్యసించి వాటిని సజీవము చెయ్యాడము ద్వారా ఋషి ఋణమును తీర్చుకుంటాడు. ఇది సనాతన ధర్మము.

పునర్జన్మ పూర్వ జన్మలపై నమ్మకము:

    మనిషి ఇహలోకములో అనుభవించే కష్ట నష్టములు అతని పూర్వజన్మ కర్మ ఫలములే అని హిందువులు నమ్ముతారు. దీనినే కర్మ సిద్ధాంతము అంటారు. మనిషికి పూర్వజన్మలు ఉన్నాయి. అలాగే ఈ జన్మలోని కర్మఫలమును అనుభవించడానికి పునర్జన్మ కూడా ఉంటుంది. ఇవి కొన్ని ప్రధానమయిన సనాతన ధర్మములు.

బ్రహ్మచర్యము

“బ్రహ్మచర్యము పాటించిన కన్య తనకు నచ్చిన భర్తను పొందగలుగుతుంది. అలాగే బ్రహ్మచర్యము పాటించే ఎద్దులు గుఱ్ఱములంతటి వేగముగా పరుగెత్తగలవు.” అని అథర్వణ వేదం చెబుతుంది. ” బ్రహ్మచర్యేణ కన్యా యువానం విన్దతే పతిమ్ అనడ్వాన్ బ్రహ్మచర్యేణాశ్వో ఘాసం జిగీర్షతి (కాండ 11, శ్లోక 3184 , సూక్త- 8).

    ఒక కన్యకు ఒక ఎద్దుకు బ్రహ్మచర్య విషయములో పోలిక చూపడములోని అంతర్యము గ్రహించవలెను. మనస్సును నియంత్రించడము ద్వారా శారీరక సంబంధమయిన కోరికలను అదుపులో ఉంచుకుని ఒక కన్య బ్రహ్మచర్యము పాటిస్తుంది. ​

ఈ పేజీలు  కూడా చదవండి

మహాత్మా గాంధీ 1869-1915

జవహర్‌లాల్ నెహ్రూ 1889-1940

డా. సర్వేపల్లి రాధాకృష్ణన్

మోక్షగుండం విశ్వేశ్వరయ్య

 ఈ క్రింది పాఠము నేను పరిశోధించి రచించిన “పాచీన భారతీయులకు అక్షర సుమాంజలి ” అను పుస్తకములోనిది. అధ్యాయము 19, ’బ్రహ్మచర్య వ్రతము’

అదే ఎద్దులయితే వాటికి బుడ్డకొట్టడమువలన శారీరకముగా నపుంసకత్వము ప్రాప్తించి బలవంతపు బ్రహ్మచర్యము పాటిస్తాయి. జంతువులకు తత్సంబంధ అవయవమును నిర్వీర్యము చేస్తేగాని అది బ్రహ్మచర్యము పాటించలేదు.

అదే ఒక మానవ కన్య తన మనస్సును నియంత్రించుకుని ఇంద్రియములను అదుపులో పెట్టుకుని బ్రహ్మచర్యము పాటించగలుగుతుంది.

ఈ శ్లోకము మానవులకు జంతువులకు గల వైవిధ్యమును సవివరముగా చెబుతుంది. ఒక యౌవన దశలో ఉన్న విద్యార్ధికూడా ఈ విధముగా ఇంద్రియ నిగ్రహముతో బ్రహ్మచర్యము పాటిస్తాడు. బ్రహ్మచర్యము పాటించడమువలన ఒనగూడే సత్ఫలితములను ఈ క్రింది శ్లోకములు వివరిస్తున్నాయి. 

బ్రహ్మచర్యాణ తపసా రాజా రాష్ట్రం వి రక్షతి

ఆచార్యో బ్రహ్మచర్యేణ బ్రహ్మచారిణమిచ్ఛతే

(శ్లోక  ౩౧౫౩,   సూక్త-  ౫ ,కాండ  ౧౧  )

    “బ్రహ్మచర్యము పాటించడము ద్వారా రాజన్ దేశమును రక్షించగలుగుతాడు. ఆచార్యుడు బ్రహ్మచర్యము పాటించి అతని శిష్యులకు ఆదర్శవంతమవుతాడు.”

Scroll to Top