తెలుగు వారు ఆంధ్రులు

వాస్తవానికి తెలుగు వారన్నా ఆంధ్రులు అన్నా అందరు ఒకటే. తెలుగు ఆంధ్రుల భాష. తెలుగు పదం త్రిలింగ పదము నుండి ఉద్భవించి ఉండవచ్చు. బౌగోళికంగా త్రిలింగ దేశమును తిలింగ దేశం గా బౌద్ధులు పేర్కొని ఉండవచ్చు.ఆవిధంగా ఆంధ్ర పదానికి తెలుగు పదం పర్యాయ పదం అయి ఉండ వచ్చు.

శిలాశాసనాలలోని శాతవాహనుల పేర్లు, మత్స్య, వాయు పురాణాలలోని ఆంధ్ర రాజుల పేర్లు ఒకటి కావడంతో ఆంధ్రులను ఆంధ్ర శాతవాహనులు అని చరిత్ర కారులు పిలుస్తారు. 

  పాటలీపుత్రాన్ని ఏలుచున్న కణ్వరాజు   సుశర్మను, శుంగ వంశాన్ని నిర్మూలించి 10 సంవత్సరాలు పాటలీపుత్రంలో 2050 సంవత్సరాల క్రితం శాతవాహనరాజు  రాజ్యమెలినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నవి. 

photo 2 1
“ప్రాచీన భారతీయులకు అక్షర సుమాంజలి (వేద కాల సమాజము)

నేను రచించిన ఈ “ప్రాచీన భారతీయులకు అక్షర సుమాంజలి (వేద కాల సమాజము)” అను పుస్తకము యొక్క విశేషములు తెలియజేసే పేజీ లోకి వెళ్ళడానికి, పుస్తకము కొనడానికి బుక్ ఫోటో పై క్లిక్ చెయ్యండి. వెల రు. 499/-

లేదా

పుస్తకమును అమెజాన్ ద్వారా కొనుగోలు చేయుటకు ఈ లింకు పై క్లిక్ చెయ్యండి. https://www.amazon.in/dp/B0CTSP19X3?ref=myi_title_dp

నా వీడియోలను యుట్యుబ్ లో తిలకించండి

బ్రహ్మావర్తము

ఆర్యజాతి వాదము

సరస్వతి నది ఆచూకీ

సాంచీ స్థూపం

అలాగే సాంచీ స్థూపం చుట్టూ ఉండే నాలుగు శిలా తోరణాలలో రెండు

( రాతి ద్వార ) శిలా తోరణాలు ఆంధ్రుడయిన ఆనందుడు నిర్మించాడు.

గౌతమీ పుత్ర శాతకర్ణి క్షహరాట రాజు నహపణుని, అతని రాజ వంశాన్ని నిర్మూలించినట్లు శిలాశాసనాలు చెబుతున్నాయి. 

ఇక్ష్వాకుల కాలంలో బుద్ధుని దేవుని లాగా పూజించటం తిలింగ దేశం లో ప్రారంభమయినది. బౌద్ధ పవిత్ర గ్రంధాలయిన దిఘ నికాయ, మధ్యమ నికాయ లను  అమరావతిలో వేదాలవలె వల్లె వేస్తున్నరని చైనా యాత్రికులు చెప్పారు. నాగార్జున కొండపై అనగా శ్రీ పర్వతం పైనే ఆచార్య నాగార్జనుడు బౌద్ధ గ్రంధాలను సంస్కృతం లో వ్రాయడం ప్రారంభించారు.  బౌద్ధంలో  వజ్రయాన శాఖను ఆచార్య నాగార్జనుడు తిలింగ దేశం లోనే అంకురార్పణ చేశాడు. దిజ్ఞాగుడు, భావవివేకుడు, బుద్ధ ఘోషుడు ఆ రోజుల్లో ఆంధ్ర ప్రాంతపు బౌద్ధ ప్రముఖులు.  

వేంగీ ( ఏలురు వద్ద ), ధాన్యకటకం, శ్రీ పర్వతం ఆరోజుల్లో ప్రసిద్ధ పట్టాణాలు.

శాతవాహనుల తరువాత  విష్ణుకుండినులు, శాలంకాయనులు, ఇక్ష్వాకులు ప్రాచీన ఆంధ్రులలో ప్రసిద్ధులు.

తెలుగు వారి లేక ఆంధ్రుల ఖ్యాతి విశ్వ విఖ్యాతమయినది. బుద్ధుని ఒక భగవంతునిగా ఆరాధించడం తెలుగు గడ్డ నాగర్జున కొండ మీదనే ప్రారంభమయినది. ఇక్ష్వాకుల కాలం లో (1700 సంవత్సరాలక్రితం) బౌద్ధ మతం బర్మ, శ్రీ లంక మొదలైన దేశాలకు ప్రాకింది. 

మరియు మహబలిపురంలోని ఎకశిలా రధాలు తెలుగు పల్లవులు నిర్మించినవే

ఇక కాకతీయుల గొప్పతనం అందరికి తెలిసిందే. 

తంజావూరు లోని బృహదేశ్వరాలయం, మధుర లోని మీనాక్షి ఆలయము తెలుగు నాయకులు కట్టించినవే.

తరువాత విజయనగర స్థాపన,  వైభావం గురుంచి ప్రత్యేకంగా చెప్పనఖ్కరలేదు.

నా ఈ వ్యాసాలను కూడా చదవండి

ALSO READ

గత శతాబ్ద కాలంగా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన వారి పేర్లు చాల ఉన్నాయి. వారిలో ముఖ్యంగా స్మరించుకోవాల్నిన   వారు :

పింగళి వెంకయ్య  

భారతీయులకు ఒక జాతీయ జెండాను ప్రసాదించింది ఈయనే ఆయన పేరు పింగళి వెంకయ్య గారు. మహాత్మా గాంధి గారు విజయవాడ వచ్చినపుడు శ్రీ వెంకయ్య గారు కాషాయం రంగు  పచ్చ రంగులు పైన క్రిందా రెండు రంగులుగా గల జెండాను చేసి చూపించారు. 

కాషాయ రంగు హిందువులకు గుర్తుగాను, పచ్చ రంగు ముస్లిములకు గుర్తు గాను ఆ రంగులను వెంకయ్య గారు అభివర్ణించారు. అయితే గాంధి గారు అడిగారట మరి మిగతా మతస్థుల సంగతేమిటని. 

అపుడు హిందూయేతర ఇస్లామేతర మతస్థులకు గుర్తుగా మధ్యలో తెలుపు రంగు చేర్చే ప్రతిపాదన జరిగింది. 
ఆ విధంగా వెంకయ్య గారు తయారు చేసిన త్రివర్ణ పతాకం జెండా మధ్యలో చరఖా చిహ్నంతో  1929లో మొట్టమొదట లాహోర్ లో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెసు సమావేశం లో ఎగురవేయబడినది. 

  1. 2)  మోక్షగుండం విశ్వేశరయ్య గారు :
  2.  
  3. ఈయన పుట్టిన రోజును భారతీయులు ఇంజనీర్ల దినోత్సవంగా జరుపుతారు,

    3) సర్వేపల్లి రాధాక్రిష్నయ్య గారు : ఈయన పుట్టినరోజును భారతీయులు ఉపాధ్యాయ దినొత్సవంగా జరుపుకుంటారు, 

  4. 4) నందమూరి తారకరామారావు గారు :
  5.  
  6. ఈయన తెలుగు వారి ఆత్మగౌరువం అంటే ఎమిటొ ఢిల్లీ వారికి తెలియ జెప్పిన వ్యక్తి, 

5) పాములపర్తి వెంకట నరసింహరవు గారు :

ఈయన అయిదు సంవత్సరాలు పూర్తిగా ప్రధాన మంత్రి పదవిలో (ప్రజాస్వామ్య పద్ధతిలో) కొనసాగిన ఏకైక హిందీయేతర వ్యక్తిగా చిరస్మరణీయులు. అంతే కాక ఇరువది సంవత్సరాల క్రితం 1993లో ఇందిరా కాంగ్రెసు పార్టి పేరును ‘భారత జాతీయ కాంగ్రెసు’ గా మార్చి వేసిన ఘనత కూడా ఈయనదే.

ఇక మద్రాస్ ప్రెసిడెన్సి లో తెలుగు వారి హవా తక్కువేమీ కాదు. 1942 లో బొబ్బిలి రాజా  మద్రాసు ప్రసిడెన్సీ కి ముఖ్యమంత్రిగా పని చేశారు. టంగుటూరి ప్రకాశం పంతులు గారు మద్రాసు రాష్ట్రానికి 1946 లో ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈ మధ్య కాలంలో తమిళ నాడు  ముఖ్య మంత్రులుగా ఊంటూవస్తున్న కరుణానిధి మరియు జయలలిత కూడా తెలుగు వారే. చిత్రమయిన వాస్తవం ఏమిటంటె తెల్ంగాణాకు ప్రత్యేక రాష్ట్రమంటూ వివాదం రేపుతున్న కెసిఆర్ పూర్వీకులు ఉత్తరకోస్తా బుడ్డిపాలెం నుండి నైజాం వలస వెళ్ళినవారే.

ఈ పేజీలు  కూడా చదవండి

మహాత్మా గాంధీ 1869-1915

జవహర్‌లాల్ నెహ్రూ 1889-1940

డా. సర్వేపల్లి రాధాకృష్ణన్

మోక్షగుండం విశ్వేశ్వరయ్య

Scroll to Top