గాయత్రీ మంత్రము

వాస్తవానికి అందరి హిందూ దేవుళ్ళను ఎవరికి వారిని స్తుతించే గాయత్రి మంత్రములు ఉంటాయి. మరియు గాయత్రి అనునది ఒక ఛందో రూప వేద శ్లోకము. అయితే ఇక్కడ మనము చదువ బోయే గాయత్రి అత్యంత విశిష్టమయిన గాయత్రి మంత్రము. కారణమేమంటే ఈ గాయత్రి మంత్రము సకల జీవ రాశుల ఉత్పత్తికి మనుగడకు మూలాధార మయిన ముల్లోకాలలో వ్యాపించి ఉండే ఆ సూర్యనారాయనుడి శక్తి స్వరూపమయిన సవితా దేవిని స్తుతించేటటు వంటిది. అందుచేత ఈ గాయత్రి మంత్రమునకు అంతటి ప్రాముఖ్యత వచ్చింది.

గాయత్రీ మంత్రము

ఓం భూర్భువః సువః తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి థియో యో నః ప్రచోదయాత్

(ఓం, భూ = భూమి; భువ = భువనము; సువః = భారము మోయుచున్న; తత్ = మూలాధారము, ఇరుసు; సవితుర్ = సావిత్రీదేవి; వరేణ్యమ్ = ప్రధానముగా కోరదగినది; బర్గ = వ్యాపించు; దేవ + అస్య = దైవ శక్తి; ధీం = బుద్ధి, మతి; అహి = ప్రసాదించుము; ధియాయ = కనికరించు; నః = బంధించుము; ప్రచోదయాత్ = ఉత్తేజపఱచుము.)

photo 2 1
“ప్రాచీన భారతీయులకు అక్షర సుమాంజలి (వేద కాల సమాజము)

నేను రచించిన ఈ “ప్రాచీన భారతీయులకు అక్షర సుమాంజలి (వేద కాల సమాజము)” అను పుస్తకము యొక్క విశేషములు తెలియజేసే పేజీ లోకి వెళ్ళడానికి, పుస్తకము కొనడానికి బుక్ ఫోటో పై క్లిక్ చెయ్యండి. వెల రు. 499/-

లేదా

పుస్తకమును అమెజాన్ ద్వారా కొనుగోలు చేయుటకు ఈ లింకు పై క్లిక్ చెయ్యండి. https://www.amazon.in/dp/B0CTSP19X3?ref=myi_title_dp

నా వీడియోలను యుట్యుబ్ లో తిలకించండి

బ్రహ్మావర్తము

ఆర్యజాతి వాదము

సరస్వతి నది ఆచూకీ

    గాయత్రీ మంత్రము యొక్క అర్ధము ఇలా చెప్పవచ్చు, “ఓం, ఓ సవితా దేవీ! ఈ భూమ్యాకాశములు వాటివాటి స్థానములలో నెలకొనియుండడానికి నీవే ములాధారమయి ఉన్నావు, నీవే ఈ భూమ్యాకాశములలో సర్వత్రా వ్యాపించియున్న ప్రాణ శక్తివి అయి ఉన్నావు. అందరికి జీవనాధారము నీవే. నీవు మాపై కరుణ చూపి మాకు సద్బుద్ధిని ప్రసాదించి మమ్ములను ఎల్లప్పుడు ఉత్తేజవంతమయిన స్థితిలో ఉండేలాగున ఆశీర్వదించుము.”

నా ఈ వ్యాసాలను కూడా చదవండి

భూః, భువః సువహ అనగా భూమి, ఆకాశము మరియి పాతాళము అని అర్థము.

ఈ త్రిభువనములకు సవితా దేవి ప్రాణశక్తిని ప్రసాదిస్తుంది అని ఈ గాయత్రి మంత్రము చెబుతుంది. అయితే ఈ త్రిభువనములే మన త్రిపురములు అని ఇంతకు మునుపటి అధ్యాయములలో తెలుసుకునియున్నాము. త్రయంబకేశ్వరి స్థల దేవత కాగా సవితా దేవి విశ్వాంతరాళములకు దేవత.  అలా ఇద్దరూ  త్రిభువనములకు ప్రాణదాతలే అవుతున్నారు అని గ్రహించవలెను.

నా ఈ వ్యాసాలను కూడా చదవండి

Scroll to Top