కాశ్మీరు సమస్య

భారత దేశమునుండి బ్రిటిషువారు వెళ్ళిపోయేటపుడు ఇచ్చటి రాజ్యములు/సంస్థానములపై  అధికారమును ఇచ్చటి జనులకు చట్టబద్ధముగా ఒప్పజెప్పడానికి ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ అనేదాన్ని ఆమోదించి అమలుపరిచారు. దానిలోని వివరములప్రకారము బ్రిటిషువారు నేరుగా పరిపాలిస్తున్న ప్రాంతములలో ప్రజామోద్యమైన ప్రభుత్వములకు అధికారము బదిలీ చెయ్యబడుతుంది. పూర్వపు నవాబ్ లు రాజాలు బ్రిటిషువారితో వివిధ ఒప్పందములవలన వారి సార్వభౌమాధికారమును పూర్తిగా అను భవించలేకుండా ఉండేవారు. ఈ యాక్ట్ ద్వారా రాజాలకు నవాబ్ లకు వారి సార్వభౌమాధికారము తిరిగి వారికి ప్రాప్తిస్తుంది.

అలా షుమారు 600 మంది చిన్నా చిలుకు రాజాలు నవాబ్ లు స్వతంత్రులు కావడము జరిగినది. ఈ యాక్ట్ ప్రకారము వీరు తమను తాము స్వతంత్రులుగా ప్రకటించుకుని రాజ్యములు ఏలవచ్చు లేక పాకిస్తానులోగాని, ఇండియాలోగాని విలీనము కావచ్చు. ఈ ప్రక్రియ అమలుచేస్తున్న కాలములో గాంధీ నిష్క్రమించారు.

photo 2 1
“ప్రాచీన భారతీయులకు అక్షర సుమాంజలి (వేద కాల సమాజము)

నేను రచించిన ఈ “ప్రాచీన భారతీయులకు అక్షర సుమాంజలి (వేద కాల సమాజము)” అను పుస్తకము యొక్క విశేషములు తెలియజేసే పేజీ లోకి వెళ్ళడానికి, పుస్తకము కొనడానికి బుక్ ఫోటో పై క్లిక్ చెయ్యండి. వెల రు. 499/-

లేదా

పుస్తకమును అమెజాన్ ద్వారా కొనుగోలు చేయుటకు ఈ లింకు పై క్లిక్ చెయ్యండి. https://www.amazon.in/dp/B0CTSP19X3?ref=myi_title_dp

మొత్తము భారము నెహ్రూ గారి మీద పడినది. ఆయన #పటేల్, #మీనన్ ల సహకారముతో ఈ సంస్థానములన్ని ఇండియాలో విలీనముచేయించగలిగారు.  ఇక్కడ ఒక విషయము గమనించాలి. 1946 నాటికే చాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ అనే సంస్థను రాజాలు, నవాబ్ లు స్థాపించుకున్నారు (బ్రిటిషువారి సహకారముతో). వీరిలో చాలామంది స్వతంత్రముగా రాజ్యములు చెయ్యడానికి కలలుగనేవారు. అప్పటికి ఇండియన్ యూనియన్ అనే దేశములేదు అని గమనించాలి. ఈ ప్రక్రియలో ఇండియన్ స్టేట్స్ డిపార్ట్ మెంట్ కు పటేల్ గారు సారధ్యము వహించారు. ఆయన మరియూ నెహ్రు అనుయాయుడు మీనన్ సంస్థానముల విలీన అంశములు చక్కదిద్దారు. 

ఇక్కడ మీనన్ గాని పటేల్ గాని స్వతంత్రులుకాదు. నెహ్రు అడుగుజాడలలో వారు వారి విధులను నిర్వహించారు. కొన్ని చోట్ల ప్రజాభిప్రాయ సేకరణలు కూడా జరిగినవి. కాంగ్రెసు వివిధ సంస్థానములలో అప్పటికే స్వాతంత్ర్య సమరము యొక్క బీజములు నాటియున్నది. నెహ్రుయొక్క వ్యక్తిత్వము, కీర్తి ఇండియాను ఒకతాటిపై తీసుకురావడానికి పూర్తిగా పనికి వచ్చినవి.

నా వీడియోలను యుట్యుబ్ లో తిలకించండి

బ్రహ్మావర్తము

ఆర్యజాతి వాదము

సరస్వతి నది ఆచూకీ

క్రొత్త భారత దేశములో చేరే విధముగా రాజాలపై నవాబులపై ప్రజలు ఒత్తిడితీసుకువచ్చారు.

అలా భౌగోళికపరముగా భారత భూభాగములో చేరవలసిన అన్ని రాజ్యములు ఇండియన్ యూనియన్ లో చేరినవి. గ్రౌండ్ వర్క్ పటేల్ మీనన్ లు చేశారు. అయితే హైదరాబాదు మరియు కాష్మీరు రాజ్యములు ఈ ప్రక్రియకు సమస్యగా తయారయినవి. నైజాము నవాబు హిందువులు ఎక్కువగానున్న రాజ్యమునకు అధిపతి. కాష్మీర్ మహారాజు ముస్లిములు ఎక్కువగానున్న సంస్థానమునకు అధిపతి. ఇండియా ఇండిపెండెన్స్ యాక్టు ప్రకారము వారి ఇష్టము వచ్చినట్టు వ్యవహరించడానికి అధికారము ఉంది. అంటే వీరు ఇండియాలోగాని పాకిస్తానులోగాని చేరవచ్చు, లేక స్వతంత్ర్య రాజ్యములుగా కొనసాగవచ్చు. నైజాము కొంతకాలము పాకిస్తానులో చేరేందుకు మంతనాలు జరిపాడు. దీనికి బ్రిటిషువారు మధ్యవర్తులుగా వ్యవహరించిన ఆధారములు కలవు. తదుపరి తమరాజ్యము స్వతంత్య రాజ్యము అని ప్రకటించుకున్నాడుకూడా. ఒక విషయము గమనించాలి. సికందరాబాదులోని మిలిటరీ కంటోన్మెంట్ లో పూర్వపు బ్రిటిషు సేనలు తత్కాల ఇండియా సేనలు అచ్చటనే ఉన్నాయి. ఈ సేనలను ఉపసంహరించేదిలేదని ఇండియా ప్రకటించినది. అయితే నైజాము స్వతంత్రరాజ్యముకాబట్టి ఇండియా సేనలు హైదరాబాదును ఆక్రమిస్తే అది అంతర్జాతీయ నేరముక్రిందవస్తుంది. అందుచేతనే హైదరాబాదుపై సైనిక చర్యకు పోలీస్ యాక్షన్ అని పేరుపెట్టారు. ఈ విషయములు జరుగుతున్న సమయమునకు ఇండియా ఒక రిపబ్లిక్ గా ఆవిర్భవించలేదు. అప్పట్లో నెహ్రునే ఇండియా ఇండియానే నెహ్రు. ఒక విధముగా చూస్తే ప్రజలకు నెహ్రుపైగల అభిమానము, గౌరవము ఇండియా ఆవిర్భావమునకు దోహదపడినది అని తెలుసుకోవలెను. బ్రిటిషువారు అధికార సమతుల్యత అనే నెపముతో ఇండియా ఒక ఐక్య దేశముగా నెలకొనడము సహించలేకపోయారు. వీరు నైజామును స్వతంత్ర్య రాజ్యముగా ప్రకటించేటట్లు ప్రేరేపించారు. అక్కడ కాష్మీరులో కాష్మీరు మహారాజును పదవీచ్యుతుడినిచేసి ప్రజాభిప్రాయనెపముతో రాజకీయముచేసి కాష్మీరును పాకిస్తానులో కలపడానికి ప్రయత్నించారు. బ్రిటిషుసైనికులు, పాకిస్తాను సైనికులు కొంతమంది ముస్లిము అజాదీయులు కలిసి శ్రీనగర్ ను ఆక్రమించడానికి ప్రయత్నించారు. వాస్తవానికి నైజాములాగానే కాష్మీరు మహారాజుకూడా స్వతంత్ర్యముగా రాజ్యమేలాలని కలలు కన్నాడు. అయితే ఈ పాకిస్తాను సైన్యములను చూసి భయపడి ఇండియాను శరణు జొచ్చాడు. పాకిస్తాను, బ్రిటుషుమరియు అజాదీయ ముస్లిముల దాడిని త్రిప్పి కొట్టడానికి ఇండియా చెయ్యిచేసుకోవాలంటే కాష్మీరును ఇండియాలో కలుపుతూ ఇన్స్ ట్ర్ మెంట్ ఆఫ్ యాక్సెషన్ పై సంతకముచెయ్యవలెనని నెహ్రు మహారజాకు షరతు విధించాడు. అలాగే ఇండియాలో ప్రజాస్వామ్య రాజ్యంగము తయారుఅవతున్న రోజులవి. కాష్మీరు ముస్లిములు ఎక్కువగా నివస్తిస్తున్న ప్రాంతముకాబట్టి ఈ మహారాజావారు ఇండియాలో చేరే నిర్ణయాన్ని ప్రజలు ఆమోదించాలని, సకాలములో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని నెహ్రుగారు చెప్పారు.  గత్యంతరము లేని స్థితిలో మహారాజా 26 అక్టోబర్ 1947 తేదీన సంతకము చేశాడు. అపుడు ఇండియన్ ఆర్మీ కాష్మీరు ప్రవేశం చేశాయి. 31 అక్టోబర్ తేదీన షేక్ అబ్దుల్లా ఆధ్వర్యములో కాష్మీరులో తాత్కాలిక ప్రభుత్వము ఏర్పాటయినది. అప్పటికే పాకిస్తాను సైన్యమును ఆక్రమించుకున్న ప్రాంతములనుండి కొంతవరకు వెళ్ళగొట్టినప్పటికి ప్రస్తుతము అజాద్ కాష్మీర్ ప్రాంతములో పాకిస్తాను సేనలు అలానే ఉన్నాయి.

నా ఈ వ్యాసాలను కూడా చదవండి

ALSO READ

పాకిస్తాను చేసిన దురాక్రమణకు బ్రిటిషువారి సహాయసహకారములు ఉండడముతో పాకిస్తాను సేనలు యుద్ధములో అది అజాదీయ ముసల్మానులు మహారాజాకు వ్యతిరేకముగాచేసిన తిరుగుబాటుఅని చెప్పుకొచ్చినది. దీనిని త్రిప్పికొట్టడానికి షేక్ అబ్దుల్లా ప్రభుత్వ ఏర్పాటు ఉపయోగపడినది. పాకిస్తాను వాదనను నిర్వీర్యముచెయ్యడానికి నెహ్రు పాకిస్తాను దురాక్రమణ చేసిందని ఐక్యరాజ్య సమితిలో పిర్యాదు చేసెను. బ్రిటను, పాకిస్తాను కలిపి ఆడుతున్న నాటకమునకు ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు జూలై 1948 నాటికి రావడముతో ఆటకట్టినది. పాకిస్తాను చివరకు తమ సేనలు అజాదీయుల తిరుగుబాటులో పాల్గొన్నట్లు ఒప్పుకున్నది.

జనవరి ఒకటవతేదీ 1949 తేదీన పాకిస్తాను భారతదేశము కాల్పుల విరమణ ఒప్పందముపై సంతకములు చేసినవి. ప్రజాభిప్రాయ సేకరణకు నిమిట్జ్ అనే అతనిని ఐక్యరాజ్య సమితి నియమించినది. ప్రజాభిప్రాయసేకరణ జరపడానికి ముందు పాకిస్తానీ సేనలు తాము ఆక్రమించిన భూభాగమునుండి వైదొలగాలనేది ఒక షరతు. ఇప్పటికీ పాకిస్తానీ సేనలు అక్కడనే ఉన్నాయి. బ్రిటను, అమెరికాల ఆధ్వర్యములో కాష్మీరును పాకిస్తానుకు ఒప్పజెప్పాలని ఐక్యరాజ్య సమితిలో ఎన్నో తీర్మానాలు ప్రవేశపెట్టారు.

కాని రష్యా తో ఆతీర్మానములు వీటో చేయించి ఇండియా యధాతథ స్థితిని కొనసాగిస్తుంది.

కాష్మీరులో శాంతి నెలకొల్పాలని ఐక్యరాజ్య సమితి చేసిన ప్రయత్నములలో నిష్పాక్షికత లోపించడమువలన కాష్మీరు సమస్య అపరిష్కృతముగా ఉండిపోయినది. ఇక్కడ ఒక ముఖ్యమయిన అంశము గుర్తించాలి. కాష్మీరు మహారాజా ఇండియా ఇండిపెండెన్స్ చట్టమునకు లోబడి కాష్మీరమును ఇండియాలో చేర్చాడు. ఆ చట్టము బ్రిటిషువారు చేసినది. అయినను బ్రిటిషువారు దీనిని అనైతికముగా వ్యతిరేకించి ఇండియాకు ద్రోహము చేస్తున్నారు. మన ఈశాన్య రాష్ట్రములలోని వేర్పాటువాద సంస్థలకు కూడా బ్రిటను ఇప్పటికి ఆశ్రయము కల్పిస్తుంది. అలాగే బ్రిటను నైజాముతో ఐక్యరాజ్య సమితిలో భారతదేశము హైదరాబాదును దురాక్రమణ చేసినదని ఒక పిటీషనును  వేయించినది. ఆ పిటీషనును 1978 లో నైజాము విత్ డ్రా చేసుకున్నాడు. 

kashmir
kashmir

1951 నుండి మొదలుపెట్టి కాష్మీరు ప్రజాప్రతినిధులు వారి రాజ్యాంగమును వ్రాసుకున్నారు. తద్విధముగా ఫిబ్రవతి 1954 లో కాష్మీరు రాజ్యాంగ సభ కాష్మీరు ఇండియాలో చేరడమును చట్టబద్ధతను కల్పిస్తూ ఒక తీర్మానమును అమోదించినది. అలా కాష్మీరుకు ప్రత్యేక రాజ్యాంగము ఉంటుంది. కాష్మీరులో చట్టబద్ధ ప్రభుత్వము 1957 నాటికి ఏర్పడినది. కరణ్ సింఘ్ సదర్ ఇ అజామ్ గాను భక్షి గులామ్ ప్రధాన మంత్రిగాను ప్రభుత్వమును ఏర్పాటు చేశారు. తరువాత ఈ ప్రధాన మంత్రి, సదర్ ఇ రియాసత్ బిరుదులను ఇందిరాగాంధి షేక్ అబ్దుల్లాను ఒప్పించి ముఖ్యమంత్రి, గవర్నర్లుగా మార్చివేసినది. 

1954 లో కాష్మీరీలకు భారతీయ పౌరసత్వము ఇవ్వబడినది. కాని కాష్మీరులో భారతీయులకు పౌరసత్వము ఉండదు. అలాగే భారతీయ సుప్రీం కోర్టు అధిపత్యాన్ని కాష్మీరుకు వ్యాప్తిచెయ్యడమయినది. 

ఈ పేజీలు  కూడా చదవండి

మహాత్మా గాంధీ 1869-1915

మహాత్మా గాంధీ 1915-1948

జవహర్‌లాల్ నెహ్రూ 1889-1940

జవహర్‌లాల్ నెహ్రూ 1938-52

జవహర్‌లాల్ నెహ్రూ 1948-1964

డా. సర్వేపల్లి రాధాకృష్ణన్

మోక్షగుండం విశ్వేశ్వరయ్య

బ్రిటిషు వారి చేతిలో గల మద్రాసు, బాంబే, కలకత్తా మొదలయిన ప్రసిడేన్సీ ప్రాంతాలు ఉండేవి.

భారతదేశ ఉపఖండములోని సంస్థానములన్నీకూడా ఒప్పందము ప్రకారము వారివారి ప్రజాస్వామ్య ప్రభుత్వములు ఏర్పాటుచేసుకుని వారి ప్రతినిధులను ఐక్య ఇండియా కు పంపించవలసి ఉంది. ఇలా కొంతమంది రాజ్యాంగ సభకు ప్రతినిధులను పంపారు. చివరకు ఎవరికి వారు చేతులెత్తేసి ఇండియా రాజ్యాంగమును ఆమోదించారు. ఇలా మొదటిలో మూడు రకములయిన రాష్ట్రములు ఉండేవి. అయితే కాష్మీరు తమ స్వయంప్రతిపత్తిని కాపాడుకోగలిగినది. ఒకప్రక్క అమెరికా, బ్రిటను, చైనా, ఆష్ట్రేలియా లు పాకిస్తానుకు వత్తాసు పలుకుతూ ఆర్ధిక, ఆయుధ సంపత్తిని ప్రసాదిస్తూ అంతర్జాతీయముగా ఇండియాను ఏకాకిని చేస్తూ కాష్మీరు సమస్యను వారి శాయ శక్తులా ఇంతకాలము రగులుస్తూనే ఉన్నారు. పూర్వము నుంచీ బ్రిటనుకు అనుకూలురయిన ఆర్ ఎస్ ఎస్ కు వారసులు ప్రతినిధులు అయిన పార్టీ ప్రస్తుతము ఇండియాలో అధికారములో ఉండడముతో వీరి హయాములో కాష్మీరును పాకిస్తానుకు ఒప్పజెప్పే దిశగా అమెరికా పావులు కదుపుతున్నట్లు ఉంది. మనము పాకిస్తాను ఆక్రమించిన పాంతమును ఆక్రమిత కాష్మీరు అంటాము. పాకిస్తాను దీనిని స్వతంత్ర్య కాష్మీరు అంటుంది. బ్రిటను, అమెరికాలు ఈ ప్రాంతమును ఇండియా ఆధీనములోనున్న కాష్మీరు అంటుంది. ఇలా అమెరికా  బ్రిటనులు సంబోధించడాన్ని ఇప్పటివరకు ఇండియా నిరసిస్తూ వస్తుంటుంది. కాని ఈ మధ్య బీజేపీ ప్రభుత్వము అమెరికా అలా సంబోధించడములో తప్పులేదు అని ప్రకటన ఇచ్చినది. అలాగే ఈ మధ్య మహారాష్ట్ర ప్రభుత్వము ఆధ్వర్యములో కాష్మీరు రాష్ట్ర పటమునుంచి పాకిస్తాను ఆక్రమిత ప్రాంతమును వెడదీసి వేరుగా చూపించినది. అంటే కాష్మీరు ఇండియాలో చేరడము బ్రిటనులాగానే ఆర్ ఎస్ ఎస్ బీజేపీలు నిరసిస్తున్నాయా? 

కాష్మీరు సమస్యను నెహ్రూ రాజేశాడని మన హిందూత్వా వాదులు వాదిస్తూ ఉంటారు. నిజానికి ఈ వాదము బ్రిటిషువారిది. నెహ్రు రాజకీయ చతురత ప్రదర్శించి కాష్మీరును చట్టబద్ధముగా ఇండియాతో కలిపాడు. ఆ చట్టముకూడా బ్రిటను తయారుచేసినదే. తాము తయారుచేసిన చట్టములోని అంశముల రీత్యానే కాష్మీరు ఇండియాలోకి చేరింది. ఈ విషయాన్ని విస్మరించి బ్రిటను కాష్మీరును పాకిస్తానుకు కట్టబెట్టాలనడం వారి కుయుక్తులను, కుతంత్రములను ఎత్తి చూపిస్తుంది. బ్రిటను అభీష్టానికి వ్యతిరేకముగా నెహ్రు ప్రవర్తించాడని బ్రిటను నెహ్రును నిందించదము సహజము. కాని ఈ బీజేపీ వారు ఈ బ్రిటను పంధాను సమర్ధించడము ఏకోవలోకి వస్తుంది?

ఈ చరిత్రక కాలములో ఆర్ ఎస్ ఎస్ దాని సంస్థలు బ్రిటనుకు బాసటగా నిలచినవి. ఇండియా వాదమును నిరసించాయి. కాష్మీరు సమస్యకు నెహ్రునే కారణమని బ్రిటను వాదన. కాష్మీరు రాజాను ఇండియాలో కల్వడానికి ఒప్పించిన నెహ్రు రాజకీయ చతురత బ్రిటనుకు ఇప్పటికీ ఎప్పటికీ కొరుకుపడని అంశము. అందుచేత బ్రిటను కాష్మీరును పాకిస్తానులోకలపాలనే దురుద్దేశమును నెహ్రు నిర్వీర్యము చేశాడుకనుక కాష్మీరు సమస్యకు నెహ్రూనే కారణమని వాదిస్తుంది. అమెరికా బ్రిటనుల మెప్పుపొందడానికి ఈ వాదనకు ఆర్ ఎస్ ఎస్ వారి వారసులు వంతపాడుతూ అసంబద్ధమయిన వాదనలు చేస్తుంటారు. ​​​

షేక్ అబ్దుల్లాను ఇందిరా గాంది 1975 లో విడుదల చేసి కొన్ని ఒప్పందములకు అంగీకరింపజేసినది. దీని ప్రకారము కాష్మీరు ఇండియాలో అంతర్భాగమని అబ్దుల్లా ఒప్పుకున్నాడు. ఇంతటితో ప్రజాభిప్రాయ సేకరణ అంశము అటకెక్కినది. అనగా షేక్ అబ్దుల్లా 1954 లో కాష్మీరు రాజ్యాంగ సభ ఇండియాలో చేరడాన్ని ఆమోదించిన తీర్మానమును షేక్ ఒప్పుకున్నాడు. అలాగే 1953 తరువాత అనగా తాను పద్వీచ్యుతుడైనప్పటినుడి ఇప్పటివరకు కాష్మీరు పార్లమెంటు చేసిన చట్టములను రద్ధుచెయ్యాలన్న అబుల్లా డిమాండ్ ను అతను వెనక్కు తీసుకున్నాడు. ఇప్పటినుండి కాష్మీరు ప్రధానమంత్రిని ముఖ్యమంత్రిగాను, సదర్ ఇ రియాసత్ ను గవర్నరుగాను సంభోదించడానికి అబ్దుల్లా ఒప్పుకున్నాడు. ఇది నిజముగా ఇందిరా గాంధియొక్క రాజకీయ చతురతకు తార్కాణము. అలా అంచెలంచలుగా కాష్మీరుపై భారతదేశముయొక్క రాజ్యాంగపరమైన పట్టును బిగిస్తూ వస్తుంది. అయితే ఇంకనూ కొన్ని అంశములు కాష్మీరు రాజ్యాంగ పరిధిలోనే ఉన్నవి. ఈ షేక్ అబ్దుల్లా పుత్రుడే ఫరూక్ అబ్దుల్లా. 

ఇక్కడ ఒక విషయము గమనించాల్సి ఉంది. యువరాజు కరణ్ సింఘ్ అధిపత్యాన్ని షేక్ అబ్దుల్లా నిరసించేవాడు. ఈ అధిపత్య పోరు 1953 నుంది 1975 వరకు అనగా రెండు దశాబ్దములపాటు కొనసాగినది. అంటే ఈ సమయములో ఇండియాలోని ప్రభుత్వములకు బ్రిటను, అమెరికాలు కునుకు లేకుండా చేసినవని అర్థము. ఈ మధ్యలో ఇందిరా గాంధి చొరవతో బాంగ్లాదేశ్ ఏర్పాటుచెయ్యడమయినది. 

భారతదేశ రాజ్యాంగ అధికరణము 370 కాశ్మీరును ఒక రాష్ట్రముగా గుర్తిస్తుంది. అలాగే కాశ్మీరుకు భారతదేశముతో రాజ్యాంగపరమయిన సాన్నిహిత్యాన్ని నిర్వచిస్తుంది. అంచెలంచెలుగా కాశ్మీరుయొక్క స్వాతంత్ర్య గుణములను నిర్వీర్యముచెయ్యడమయినది. ఈ అధికరణములేకపోతే కాశ్మీరుకు 1947 కు పూర్వపు పరిస్థితి ప్రాప్తిస్తుంది. అంటే భారతదేశముతో విడిపోతుంది. హిందుత్వా వాదులకు కావలసినదిదేనేమో? అందుచేతనే వీరు ఆర్టికల్ 370 ను రద్దుచెయ్యాలని కోరుతుంటారు.

Scroll to Top