మహాత్మా గాంధీ 1869-1915

మోహన్దాస్ కరంచంద్ గాంధీ

శ్రీ మహాత్మా గాంధీ గారి అసలు పేరు మోహన్దాస్ కరంచంద్ గాంధీ. ఆయన కరంచంద్ ఉత్తమ్‌చంద్ గాంధీ మరియు పుట్లిబాయిల కు 1869 అక్టోబర్ 2 న పోర్బందర్ (ప్రస్తుత గుజరాత్ రాష్ట్రం లోని) లో జన్మించాడు. ఆయన తండ్రి మరియు పినతండ్రి పోర్బందర్ మరియు రాజ్కోట్ జమిన్దారీలలో దివాన్ లు గా వివిధ దశలలో పనిచేశారు. గాంధీజీ 18 సంవత్సరాల వయస్సు లోనే న్యాయవాద విద్యను అభ్యసించడానికి లండన్ వెళ్ళాడు. ఆయన 1891 లో లండన్ లోని ఇన్నర్ టెంపుల్ యూనివర్శిటీ కాలేజీలోని లో తన న్యాయవాది (న్యాయవాది) కోర్సు పూర్తి చేసి 1892 లో భారతదేశానికి తిరిగి వచ్చాడు. అంతకుముందు, 13 సంవత్సరాల వయస్సులో, అతను 14 సంవత్సరాల వయస్సులో ఉన్న కస్తూర్బా ను వివాహం చేసుకున్నాడు.

జాతి పిత

భారతీయులు మహాత్మా గాంధీని జాతి పిత గా భావిస్తారు. వాస్తవానికి గాంధీ గారిని జాతిపిత అని తొలుత సంబోధించిన వారు నేతాజీ సుభాష్ చంద్ర బోస్. నేతాజీ జూలై 6, 1944 న సింగపూర్ నుండి భారతీయులను ఉద్దేశించి చేసిన రేడియో ప్రసంగంలో గాంధీని జాతి పిత అని కొనియాడారు. ఆ సమయంలో బోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ ను తోడుకొని భారతదేశం వైపు వస్తున్నాడు.

photo 2 1
“ప్రాచీన భారతీయులకు అక్షర సుమాంజలి (వేద కాల సమాజము)

నేను రచించిన ఈ “ప్రాచీన భారతీయులకు అక్షర సుమాంజలి (వేద కాల సమాజము)” అను పుస్తకము యొక్క విశేషములు తెలియజేసే పేజీ లోకి వెళ్ళడానికి, పుస్తకము కొనడానికి బుక్ ఫోటో పై క్లిక్ చెయ్యండి. వెల రు. 499/-

లేదా

పుస్తకమును అమెజాన్ ద్వారా కొనుగోలు చేయుటకు ఈ లింకు పై క్లిక్ చెయ్యండి. https://www.amazon.in/dp/B0CTSP19X3?ref=myi_title_dp

మరియు మహాత్మా గాంధీ ఆయన గడిపిన అసాధారణ సాత్విక జీవన విధానము వలన ప్రపంచవ్యాప్తంగా ఎంతో గౌరవించబడుతున్నాడు. ప్రపంచం గాంధీని ఆరాధిస్తుంది. భారత దేశ విముక్తికి ఆయన ఎన్నుకున్న ఆయుధ రహిత శాంతియుత పోరాట విధానమును ప్రపంచ జనులు ఇప్పటికీ ఆశ్చర్యముతో చూస్తుంటారు.  వాస్తవానికి, పూణేకు చెందిన శ్రీ బాల గంగాధర తిలక్ స్వరాజ్యం లేక స్వాతంత్ర్యం నా జన్మ హక్కు అని ప్రకటించి బ్రిటీషు వారికి వ్యతిరేకంగా పోరాటం చేశారు.

నా వీడియోలను యుట్యుబ్ లో తిలకించండి

బ్రహ్మావర్తము

ఆర్యజాతి వాదము

సరస్వతి నది ఆచూకీ

ఆయన పెద్ద ఎత్తున గణపతి ఉత్సవాలను ప్రారంభించి హిందువులలో దేశ భక్తికి ఆజ్యం పోశారు. మరియొకరు శ్రీ అరబిందో ఘోష్ బెంగాల్‌లో దసరా పండుగలను ప్రవేశపెట్టడం ద్వారా బెంగాలులో దేశ భక్తీ కి పునాది వేశారు. ఈ వ్యూహాలు భారతీయ హిందూ ప్రజలలో బాగానే పనిచేశాయి. తరువాత గాంధీ సారద్యంలో జాతీయ విముక్తి పోరాటంలో పాల్గొనడానికి ఆ విధంగా ప్రజలు సిద్ధం అయి ఉన్నారు.

కానీ గాంధీ యొక్క పోరాట విధానము వేరు. ఆయన శాంతియుత సత్యాగ్రహ విధానాన్ని ఆయుధంగా ఉపయోగించి బ్రిటిషు వారిని దేశం నుండి వెళ్ళగొట్టారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ గాంధీపై తన అభిప్రాయాన్ని ఈ విధంగా వ్యక్తం చేశారు, “ఇలాంటి జ్ఞానోదయుడైన సమకాలీన మహాత్మా గాంధీ ని దైవము మనకు బహుమతిగా ఇచ్చినందుకు మనమందరం దేవునికి కృతజ్ఞతలు తెలియజేద్దాం. రాబోయే తరాలవారు ఇలాంటి బక్కపలచని, సాత్విక మానవుడు ఈ భూమిపై జన్మించి నడయాడి యున్నాడా అని ఆశ్చర్యపోతారు. “

మార్టిన్ లూథర్ కింగ్

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందిన మార్టిన్ లూథర్ కింగ్ ఈ విధంగా గాంధీని ప్రశంసించారు, “క్రీస్తు మాకు లక్ష్యాన్ని ఇచ్చాడు అయితే మహాత్మా గాంధీ మాకు పోరాట వ్యూహాన్ని ప్రసాదించాడు”. కానీ ఒక కవిని ప్రేరేపించే నెమలి యొక్క అందం పులి మనసుకు అదే విధమయిన భావోద్వేగాన్ని కలిగించదని మనకు తెలుసు.

చర్చిల్

1931 లో లండన్‌లో జరిగిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ విఫలమైన తరువాత, చర్చిల్ గాంధీని ఈ విధంగా అవహేళన చేస్తూ మాట్లాడాడు: ‘ఇతను (గాంధీ) చాలా ప్రమాదకరమైన వ్యక్తీ. చూడటానికి ఉదాసీనంగా ఉంటాడు, ఇతను ఒక దేశద్రోహ న్యాయవాది, ఇప్పుడు ఫకీర్‌గా నటిస్తూ, బ్రిటిష్ ప్యాలెస్‌లోని బ్రిటిష్ ప్యాలెస్ ప్రతినిధులతో సమాన హోదాలో తిరుగుతున్నాడు. ఇది సరికాదు.’

చర్చిల్ గాంధీని నియంత మరియు హిందూ ముస్సోలిని అని పిలిచాడు.,  గాంధి ఒక జాతి యుద్ధాన్ని నిర్వహిస్తున్నాడని, అతను బ్రిటిష్ అధికారం స్థానంలో కుటిల బ్రాహ్మణులను నియమించాలని చూస్తున్నాడని, గాంధీ తన వ్యక్తిగత స్వార్థ లాభం కోసం భారత ప్రజల అజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నాడని నిందించాడు.

ఈ పేజీలు  కూడా చదవండి

మహాత్మా గాంధీ 1915-1948

జవహర్‌లాల్ నెహ్రూ 1889-1940

జవహర్‌లాల్ నెహ్రూ 1938-52

జవహర్‌లాల్ నెహ్రూ 1948-1964

డా. సర్వేపల్లి రాధాకృష్ణన్

మోక్షగుండం విశ్వేశ్వరయ్య

తరువాత 1944 లో చర్చిల్ గాంధీ జైలులో సత్యాగ్రహం లో భాగంగా ఉపవాసం చేస్తుంటే గాంధి జైలులో మరణిస్తాడేమో దానికి ప్రజలు తిరగాబడతారేమో అని భయపడ్డాడు. అందుచేత చర్చిల్ జైలు అధికారులకు ‘ఆ అర్ధ నగ్న ఫకీరును సత్వరమే జైలు నుంచి బయటకు విసరి వేయండి. ఆతను జైలులో మరణించకూడదు’ అని టెలిగ్రాము పంపాడు.

ఇంగ్లాండ్ మరియు యూరప్ ప్రజల మనస్సులలో సానుభూతిని కలుగుతుందేమోననే భయంతో గాంధీ జైలులో ఉపవాసం చేస్తున్న సమయం లో తీసిన ఫోటోలను వార్తా పత్రికలలో ప్రచురించకుండా బ్రిటిషు వారు ఆదేశాలిచ్చారు.   
టైమ్ మ్యాగజైన్ దలైలామా, లేఖ్ వాలెసా, మార్టిన్ లూథర్ కింగ్, సీజర్ చావెజ్, ఆంగ్ సాన్ సూకీ, బెనిగ్నో అక్వినో జూనియర్, డెస్మండ్ టుటు మరియు నెల్సన్ మండేలాలను గాంధీ శిష్యులుగాను అసలైన వారసులుగాను ఈమధ్య పేర్కొంది.

బరాక్ ఒబామా

2010 లో భారత పార్లమెంటులో చేసిన ప్రసంగంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇలా అన్నారు:
‘గాంధీ తన సందేశాన్ని అమెరికాకు మరియు ప్రపంచానికి ఇవ్వకపోతే నేను ఈ రోజు అమెరికా అధ్యక్షుడిగా మీ ముందు నిలబడను.’

ఈ విధంగా ప్రపంచం గాంధీ పట్ల గౌరవం ఎందుకు చూపిస్తుందో, చర్చిల్ లాంటి వ్యక్తులు గాంధీని చూసి ఎందుకు కలత చెందుతున్నారో చూద్దాం.

స్వాతంత్య్ర సంగ్రామంలో రాజేంద్ర ప్రసాద్, తేజ్ బహదూర్ సప్రూ, పటేల్, నెహ్రూ, బోస్ తో సహా అతని సహచరులు చాలా సార్లు గాంధీ విధానాలతో విభేదించారు. కాని (బోస్ తప్ప) వారెవరూ గాంధీని ఎన్నడూ విడిచిపెట్టలేదు. సుభాష్ చంద్ర బోస్ 1937 లోను తరువాత 1938 లోను  భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ పడి గెలిచాడు. అయితే 1938 లో గాంధి అభ్యర్ధిగా పట్టాభి సీతారామయ్య నిలుచున్నాడు. పట్టాభి ఓడిపోయాడు. అయితే బోస్ త్వరిత కాలంలోనే రాజీనామా చెయ్యాల్సి వచ్చింది. ఎందుచేతనంటే స్వాతంత్య్ర సంగ్రామ పోరాటంలో అనుసరించాల్సిన వ్యూహంపై బోస్ గాంధీతో విభేదించారు. అయితే, నేతాజీ 1944 లో గాంధీని జాతి పిత గా పిలిచారు. పటేల్ కాంగ్రెస్ లో జమిందారులు రాజాలు మొదలయిన వారి నాయకుడు. నెహ్రూ ప్రసిద్ధ వక్త, ఆయన మాట్లాడుతుంటే జనులు మంత్రం ముగ్డులయిపోయేవారు. గాంధీ వీరిద్దరిని స్వాతంత్ర్య పోరాటంలో కలిసి పనిచేసేలా చేశారు. పటేల్, తన చివరి రోజులలో తన అనుయాయులను పిలచి వారినందరినీ నెహ్రూను అనుసరించి ఉండమని  నెహ్రూను ఏ విధంగాను వ్యతిరేకించవద్దని కోరాడు.

గాంధీ నెహ్రూ పటేల్

గాంధీ, నెహ్రూ చాలా సందర్భాలలో ఒకరినొకరు విభేదించుకునేవారు. 1922 లో చౌరి చౌరా సంఘటన తరువాత, గాంధీ సహకార నిరాకరనోద్యమాన్ని వాయిదా వేశారు. అప్పుడు నెహ్రూ, బోస్ గాంధీని నిందించారు. వాస్తవానికి ప్రజా స్పందన’ ఉద్యమాన్ని కొనసాగించడానికి అనుకూలంగా ఉంది. గాంధీ యొక్క ఒక్క మాటతో ఉద్యమం ఆగిపోయింది. అలాగే 1946 లో దేశంలోని అన్ని జాతీయ కాంగ్రెస్ కమిటీలు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పోటీ చేయడానికి పటేల్ అభ్యర్థిత్వాన్ని కరారు చేసినపుడు గాంధీ ఒప్పుకోలేదు. పటేల్ కు బదులుగా గాంధి నెహ్రూ పేరును సూచించాడు.

పటేల్ సంతోషంగా పోటీ నుండి వైదొలిగాడు. గాంధీకి ఇంత బలం ఎక్కడ నుంచి వచ్చింది? గాంధీ యొక్క ధృడ సంకల్పం, ఆయన యొక్క వ్యక్తిత్వం ఆయనను  ప్రజలు విశ్వసించేటట్లు చేసిందనుకుంటాను. ఎటువంటి అవాంతరాలు కష్టాలు ఎదురైనా గాంధి తానూ నమ్మిన సిద్దాంతములను అహింసా వాదాన్ని ఎన్నడూ వీడలేదు. అలా అని జైలు శిక్షలకు, మృత్యువు కు భయపడలేదు.

నా ఈ వ్యాసాలను కూడా చదవండి

ALSO READ

గాంధీ హిందూ వైష్ణవ కుటుంబంలో జన్మించాడు. వైష్ణవ మతం ఒక వ్యక్తికి మానవత్వంతో జీవించడం నేర్పుతుంది. మరియు వైష్ణవ మతం భగవంతుడిని సర్వాంతర్యామిఅని చెబుతుంది. దీని ప్రకారం, దేవుడు ప్రతి మానవుడిలో నివసిస్తాడు. కాబట్టి ప్రతి వ్యక్తీ తన యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం ద్వారా దేవుని రక్షించుకోవాలి. మరియు ఇతర మానవులను మానవీయంగా చూసుకోవడం ద్వారా దేవుని ఆరాదించుకోవాలి. ఇది వైష్ణవ తత్త్వం. తనను అగౌరవ పరచే ఏ అధికారాన్నయినా ఆయన ఎదిరించడం తన యొక్క విద్యుక్త ధర్మం గా భావించి గాంధి గారు జీవితం కొనసాగించారు. జైన మతం కూడా గాంధీపై తీవ్ర ప్రభావం చూపినట్లు కనబడుతుంది. జైన మతం అహింసను ప్రబోధిస్తుంది. ఈ జైన అహింస భావనను గాంధి బ్రిటిషు వారి ఆధిపత్యానికి వ్యతిరేకంగా శక్తివంతమైన ఆయుధంగా తయారు చేసుకుని సత్యాగ్రహ రూపంలో ఉపయోగించాడని నేను భావిస్తున్నాను. అదియును చేతిలో ఆయుధం ధరించకుండా ఆయుధ సంపత్తి ఉన్న శతృవు తో పోరాటం సల్పడం. శతృవును నైతికంగా బంధించడం, అతను తయారుచేసిన చట్టాలను అతనిపైనే ప్రయోగించడం. ప్రపంచంలోనే ఇది ఒక క్రొత్త ఒరవడి. అందుకే ప్రపంచం ఇప్పటికీ గాంధీ గార్ని కొనియాడుతుంది.

ఆయన దక్షిణాఫ్రికాలో ఉన్న సమయంలో పురాణాలు మరియు ఇతర హిందూ గ్రంథాలను చదివాడు. అప్పుడు అతని మనస్సు బ్రహ్మచర్యం వైపు మొగ్గు చూపింది. అతను తన 42 సంవత్సరాల వయస్సు నుండి బ్రహ్మచర్యం పాటించడం ప్రారంభించాడు. బ్రహ్మ చర్య వ్రతం ఆయనలో దివ్య శక్తిని ప్రేరేపించి యుంటుంది. 

ఆయన గుజరాతీలో సత్యానా ప్రయోగం అతవా ఆత్మకథ పేరుతో ఒక పుస్తకం రాశారు. దక్షిణాఫ్రికాలోని క్రిస్టియన్ మిషన్ ప్రజలు అతన్ని క్రైస్తవ మతంలోకి మార్చడానికి ప్రయత్నించారని గాంధీ తన పుస్తకంలో పేర్కొన్నారు. గాంధీ వారి తో క్రైస్తవ ప్రార్థనలలో పాల్గొన్నారు. వారితో బైబిల్ లోని అంశాల గురించి చర్చించారు. కాని క్రీస్తు దేవుని ఏకైక కుమారుడు అనే వారి వాదనను గాంధి అంగీకరించలేదు. దేవుడు ప్రతి మానవుడిలో నివసిస్తున్నాడని గాంధీ నమ్మాడు. అందువల్ల మానవులందరూ క్రీస్తుతో సహా దేవుని కుమారులు అవుతున్నారు అని వారితో వాదించాడు. దీనిని అద్వైత తత్వశాస్త్రం, ద్వైత సిద్దాంతం అని పిలుస్తారు, దీని ప్రకారం దేవుడు ప్రతి వ్యక్తిలో మరియు అన్ని జీవులలో వసించి ఉంటాడు.

మరియు హిందూ గ్రంధాలలో ఏమి ఉందో తెలుసుకోవడానికి గ్రంథాలను చదవడం ప్రారంభించానని గాంధీ చెప్పారు. తద్వారా క్రైస్తవులు హిందూ ఆచార వ్యవహారాలపై చేసే విమర్శలను ఎదుర్కోనవచ్చని గాంధి భావించాడు.

గాంధీ బైబిల్ మరియు ఖురాన్ కూడా చదివాడు. మహ్మద్ ప్రవక్త యొక్క వ్యక్తిత్వాన్ని ధృడ సంకల్పాన్ని ఆయన ప్రశంసించారు. అయితే, ఇస్లాం లో ఖురాన్ పై చేసిన వ్యాఖ్యానాల లో నిజాన్ని గ్రహించేటపుదు జాగ్రత్త వహించాలని కోరారు.

చిన్నతనంలో తాను బిడియ పడే మనస్తత్వం కలిగియుండేవాడినని ఎవరితోనూ కలిసేవాడిని కానని గాంధి చెబుతారు. కానీ ఆయనలో సామాజిక దృక్పదం మెండు. 20 సంవత్సరాల వయసులోనే ఆయన లండన్ లో చదువుతున్న వయసులో లండన్  వెజిటేరియన్ సొసైటీలో సభ్యుడుగా చేరాడు. దక్షిణాఫ్రికాలో సత్యాగ్రహం అనే అహింసాయుత ఆయుధం తో తాను చేసిన పోరాటముల అనుభవంతో ఇండియాలో స్వాతంత్ర్య సమరాన్ని విజయవంతం చేయ్యగాలిగాడు. ఆయన వ్యతిరిక్త వాతావరణం లో దక్షిణాఫ్రికాలో 21 సంవత్సరాలు నివసించాడు. అతన్ని అనేకసార్లు అరెస్టు చేసి అక్కడ జైలు లో పెట్టారు.

కానీ ఎప్పుడూ ఒక అడుగు వెనుకకు వెయ్యలేదు. ఆయన చేసిన పనిని గాని చెప్పిన మాటను గాని ఎప్పుడు వెనుకకు తీసుకోలేదు. క్షమాపణ చెప్పలేదు. న్యాయ స్థానంలో నిలుచుని అన్యాయాన్ని ఎదిరించి పోరాడడం తన బాధ్యత అని వివరించేవాడు. కోర్టువారు సముచితమని భావిస్తే శిక్షను అనుభవించడానికి తానూ సంసిద్ధమని ప్రకతిన్చేవాడు. అతను తన నమ్మకాలకు అనుగుణంగానే జీవించాడు.  

దక్షిణ ఆఫ్రికాలో


ఏప్రిల్ 1893 లో గాంధీ దక్షిణాఫ్రికాకు పయనించేటప్పటికీ ఆయనకు 23 సంవత్సరాలు. అతను కొంతకాలం ఖాన్ అండ్ కంపెనీ కోసం పనిచేశాడు మరియు తరువాత స్వంతంగా కూడా న్యాయవాద వృత్తి నిర్వహించాడు. అతను దక్షిణాఫ్రికాలో 21 సంవత్సరాలు నివసించాడు.
ఒకసారి తోటి యూరోపియన్ ప్రయాణీకులు గాంధీని డ్రైవర్ దగ్గర నేలపై కూర్చోమని ఆదేశించగా అలా కూర్చోవడానికి నిరాకరించాడు. అపుడు గాంధీ ని వారు కొట్టారు.

మరొక ఘటనలో, అతను తెల్ల జాతి వారి ఇంటి సమీపంలో నడుస్తున్నందుకు డ్రైనేజీలోకి నెట్టారు. ఒకసారి ఫస్ట్ క్లాస్ కంపార్ట్‌మెంట్ లో ప్రయాణిస్తుంటే తోటి యోరోపియన్ ప్రయాణికులు అతనిని దిగువ తరగతి కంపార్ట్మెంట్ కు మారిపోమ్మంటే గాంధి నిరాకరించాడు. అపుడు గాంధి  పీటర్‌మరిట్జ్‌బర్గ్‌లో రైలు నుండి విసిరివేయబడ్డాడు. అతను రాత్రంతా చలిలో వణుకుతు రైలు స్టేషన్ వద్ద కూర్చుని, భారతదేశానికి తిరిగి వెళ్ళిపోవాలా లేక దక్షిణాఫ్రికాలోనే ఉంటూ తన వ్యక్తిగత హక్కుల కోసం పోరాడాలా అని ఆలోచిస్తూనే ఉన్నాడు. అయితే చివరికి అతను దక్షిణ ఆఫ్రికాలోనే ఉంటూ పోరాడటానికి నిర్ణయించుకున్నాడు. ఆపై మరుసటి రోజు రైలు ఎక్కడానికి అనుమతించారు. మరొక సంఘటనలో, డర్బన్ కోర్టు మేజిస్ట్రేట్ గాంధీ తన తలపాగా తొలగించమని ఆదేశించాడు, అతను అలా చేయడానికి నిరాకరించాడు.

జనవరి 1897 లో, గాంధీ డర్బన్‌లో అడుగుపెట్టినప్పుడు, అతనిపై తెల్లవారి గుంపు ఒకటి దాడి చేసింది. దక్షిణాఫ్రికాలో గాంధీ మానసికంగాను, శారీరకంగాను యాతనలుపడ్డాడు. గాంధీ మాదిరిగా, భారతీయులు చాలామంది అక్కడ అలా బాధలకు గురి అయి ఉంటారు. కానీ గాంధీ వారిపై పోరాటం చేశాడు. ఆయుధాలు చేపట్టకుండా.

దక్షిణాఫ్రికాలోని యూరోపియన్లు గాంధిని “పరాన్నజీవి” అని, “అడవి మనిషి” అని, “మురికి కూలి ” అని, “బ్రౌన్ జాతి” వాడని ఎగతాళి చేస్తూ పిలిచెవారు.

అక్కడ దక్షిణ ఆఫ్రికా లో భారతీయుల ఓటు హక్కును తొలగించే బిల్లుకు వ్యతిరేకంగా గాంధీ పోరాడారు. అతను దీనిలోలో విజయం సాధించలేకపోయినా, దక్షిణాఫ్రికాలో నివసిస్తున్న భారతీయుల బాధలను ప్రభుత్వ దృష్టిలోకి తీసుకురావడంలో ఆ పోరాటం సఫలమయినదని గాంధీ చెబుతారు. తరువాత 1894 లో నాటల్ ఇండియన్ కాంగ్రెస్ స్థాపించడంలో ఆయన ముఖ్యపాత్ర పోషించారు.

1910 లో, గాంధీ తన స్నేహితుడు హర్మన్ కల్లెన్‌బాక్ సహాయంతో జోహాన్నెస్‌బర్గ్ సమీపంలో “టాల్‌స్టాయ్ ఫామ్” ను స్థాపించాడు. అక్కడ ఆయన శాంతియుత ప్రతిఘటన విధానాన్ని పోషించారు. గాంధి దక్షిణ ఆఫ్రికాను 1914 లో విడిచిపెట్టి వచ్చేశారు.

అయితే ఈ మధ్య 1994 లో దక్షిణాఫ్రికాలో నల్లజాతి ప్రజలు ఓటు హక్కును సాధించిన తరువాత, గాంధీని అనేక స్మారక చిహ్నాలతో గౌరవించి తమ దేశ జాతీయ వీరుడిగా ప్రకటించారు.

గోపాల్ కృష్ణ గోఖలే సి. ఎఫ్ ఆండ్రూస్ అనునాయనతో కబురుచేయ్యగా గాంధీ 1915 లో భారతదేశానికి తిరిగి వచ్చారు. గోఖలే భారతదేశంలో నెలకొని ఉన్న రాజకీయ స్థితి గతుల గురించిన వివరాలు గాంధి కి వివరించాడు. దక్షిణాఫ్రికాలో గాంధీ యొక్క అరెస్టుల మరియు జైలుకు ఎప్పుడెప్పుడు వెళ్ళాడు అనే వివరాలను ఇక్కడ తెలియజేస్తున్నాను,

జనవరి 10, 1908 – ట్రాన్స్‌వాల్‌ను విడిచిపెట్టి వెళ్ళడంలో విఫలమైనందుకు అతనికి రెండు నెలల సాధారణ జైలు శిక్ష విధించబడింది. అనంతరం ఆయన జనవరి 30 న విడుదలయ్యారు.

అక్టోబర్ 07, 1908 – నాటాల్ నుండి తిరిగి వచ్చేటప్పుడు, అతను తన రిజిస్ట్రేషన్ను చూపించడంలో విఫలమైనందున, అతనికి కఠినమైన శ్రమతో జైలు శిక్ష విధించబడింది. వాస్తవానికి ఆయన సదరు పేపర్లను నిరసనగా ధ్వంసం చేసియున్నాడు.

ఫిబ్రవరి 25, 1909 – రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ను చూపించనందుకు అరెస్టు చేసి 3 నెలలు ట్రాన్స్‌వాల్‌ లో జైలు శిక్ష అమలు చేశారు.

నవంబర్ 06, 1913 – పామ్ ఫోర్డ్ వద్ద అతన్ని అరెస్టు చేశారు, కాని కల్లెన్‌బాక్ ఇచ్చిన బెయిల్‌పై విడుదల చేశారు.

నవంబర్ 08, 1913 – తిరిగి అరెస్టు చేసి బెయిల్‌పై విడుదల చేశారు.

09 నవంబర్ 1913 – అరెస్టు చేసి తొమ్మిది నెలల జైలు శిక్ష విధించారు. వోల్ఖర్స్ట్‌లో మూడు నెలల శిక్ష విధించబడింది. కానీ డిసెంబర్ 18, 1913 న విడుదలయ్యారు.

Scroll to Top