శుభ ముహూర్తములు

శుభ ముహూర్తములు శుభ తిథులు

ముహూర్తమనగా శుభ సమయం అని లోక నానుడి. వాస్తవానికి శుభ ముహూర్తము అనగా రెండు ఘడియల కాలము. ఒక ఘడియ అనగా ప్రస్తుతం మన వాడుకలోఉన్న కాలమానములో 24 నిమిషముల కాల ప్రమాణము. అప్పుడు ముహూర్తమంటే 48 నిమిషముల కాలం అవుతుంది. నిజానికి శాస్త్రరీత్యా అహః ప్రమాణాన్ని 15 తో భాగించగా వచ్చే కాలము పగటి కాలములో ముహూర్తం అవుతుంది. అలాగే రాత్రి ముహూర్తముకూడా లెక్క గట్టాల్సి ఉంటుంది. దిన ప్రమాణము, రాత్రి ప్రమాణము రోజు మారుతు ఉంటాయి కాబట్టి ముహూర్త కాల ప్రమాణము కూడా మారడం సహజం.

తిథి సంజ్ఞలు

ఒక మాసమునకు 30 తిథులు. శుక్ల పక్షములో 15 కృష్ణ పక్షములో 15 మొత్తము 30 తిథులు. శుక్ల పక్షములో చివరి తిథి పౌర్ణమి. కృష్ణ పక్షములో చివరి తిథి అమావాస్య.

నంద తిథులు

నంద తిథులు: ప్రతిపద లేక పాడ్యమి, షష్టి, ఏకాదశి ఈ మూడును నంద తిథులు.

భద్ర తిథులు

భద్ర తిథులు: విదియ, సప్తమి, ద్వాదశి ఈ మూడు భద్ర తిథులు.

జయ తిథులు

జయ తిథులు: తదియ ( తృతీయ ), అష్టమి, త్రయోదశి ఈ ముడు జయ తిథులు.

రిక్త తిథులు

రిక్త తిథులు: చవితి ( చతుర్థి ), నవమి, చతుర్దశి ఈ మూడును రిక్త తిథులు.

పూర్ణ తిథులు

పూర్ణ తిథులు: పంచమి, దశమి, పౌర్ణమి – వీటికి పూర్ణ తిథులు అని పేరు.

వారము ( రోజు ) లతో తిథులను శుభాశుభ విశేషములను ఈ క్రింది విధముగా బేరీజు వేస్తారు.

photo 2 1
“ప్రాచీన భారతీయులకు అక్షర సుమాంజలి (వేద కాల సమాజము)

నేను రచించిన ఈ “ప్రాచీన భారతీయులకు అక్షర సుమాంజలి (వేద కాల సమాజము)” అను పుస్తకము యొక్క విశేషములు తెలియజేసే పేజీ లోకి వెళ్ళడానికి, పుస్తకము కొనడానికి బుక్ ఫోటో పై క్లిక్ చెయ్యండి. వెల రు. 499/-

లేదా

పుస్తకమును అమెజాన్ ద్వారా కొనుగోలు చేయుటకు ఈ లింకు పై క్లిక్ చెయ్యండి. https://www.amazon.in/dp/B0CTSP19X3?ref=myi_title_dp

నా వీడియోలను యుట్యుబ్ లో తిలకించండి

బ్రహ్మావర్తము

ఆర్యజాతి వాదము

సరస్వతి నది ఆచూకీ

సిద్ధ తిథులు

సిద్ధ తిథులు – ఇవి శుభ ప్రదములు:

శుక్ర వారము నాటి నంద తిథులు – పాడ్యమి, షష్టి, ఏకాదశి

బుధవారము నాటి భద్ర తిథులు – విదియ, సప్తమి, ద్వాదశి

మంగళ వారము నాటి జయ తిథులు – తదియ, అష్టమి, త్రయోదశి

శని వారము నాటి రిక్త తిథులు – చవితి, నవమి, చతుర్దశి

గురు వారము నాటి పూర్ణ తిథులు – పంచమి, దశమి, పౌర్ణమి

పైన తెలుప బడిన సిద్ధ తిథులు  మంచివి అనగా శుభ కరమయినవిగా భావిస్తారు.

వేద సూక్తములకోరకు ఈ క్రింది బటన్ లపై క్లిక్ చెయ్యండి.

నా ఈ వ్యాసాలను కూడా చదవండి

త్రివిధ నవమి

త్రివిధ నవమి విశేషము:

నవమి విషయములో ఈ క్రింది శ్లోకమును పరిశిలిద్దాము.

ప్రవేశాన్నిర్గమం తస్మాత్ర్పవే శనవమేతిథౌ

నక్షత్రేపి తథావారే నైవ సుర్యాత్కదాచన

ప్రయాణము చేసి ఇంటికి వచ్చిన తరువాత తొమ్మిదవరోజు తిరిగి ప్రయాణము చెయ్యకూడదని పై శ్లోకము చెబుతుంది. అట్లే ప్రయాణమయిన రోజునుండి తొమ్మిదవరోజున తిరిగి ఇంటికి రాకూడదు. అట్లాగే నవమి తిథి ఉన్నరోజును ప్రత్యక్ష నవమి అంటారు. అంచేత నవమి రోజున కూడా ప్రయాణము బయలు దేర కూడదు. ( సూచన: ఇంత చాందస్తంగా ప్రయాణాలు చెయ్యలన్న ప్రయాణాలు మానాలన్న ప్రస్తుత కాలములో వీలు కాదు. శాస్త్రము ఎంత స్పష్టముగా మానవుని జీవితగమనాన్ని విశ్లేషించినదో తెలుసుకోవడానికి పై శ్లోకమును ఉటంకించడమయినది. )

ఈ పేజీలు  కూడా చదవండి

మహాత్మా గాంధీ 1869-1915

జవహర్‌లాల్ నెహ్రూ 1889-1940

డా. సర్వేపల్లి రాధాకృష్ణన్

మోక్షగుండం విశ్వేశ్వరయ్య

Scroll to Top