వేదములు

వేదములు నాలుగు. అవి ఒకటి అథర్వణ వేదము, రెండు ఋగ్వేదము, మూడు సామ వేదము మరియు నాల్గవది యజుర్వేదము. వేద అనగా తెలిసికొనదగినది, తెలుసుకోవలసినది అని అర్థము. ​

వేదములు శృతులు వేదాంగములు స్మృతులు

వేదములను శృతులు అంటారు. ( ఇతర రచనలను స్మృతులు అంటారు. ). వేదాంగములు వేదములు రెంటిని కలిపి వేద సంహితములు అంటారు. వేదములకు అనుసంధానము / సంహితము చేయబడినవి వేదాంగములు. వాస్తవానికి వేదాంగములు ఆరు అవి,…..

 ఈ పాఠము నేను పరిశోధించి రచించిన “పాచీన భారతీయులకు అక్షర సుమాంజలి ” అను పుస్తకములోనిది. అధ్యాయము  2,  ‘ వేద సంపద’

ప్రస్తుతము వేదములు నాలుగు, అవి వరుసగా అథర్వణ వేదము, ఋగ్వేదము, సామవేదము మరియు యజుర్వేదము. ఋగ్వేదమును ముందుగా వ్రాశారని, తరువాత యజుర్వేదము వ్రాశారని, తరువాత సామవేదము, చివరిగా అథర్వణవేదమును వ్రాశారని చరిత్రకారులు నమ్ముతారు. కాని వేద వ్యాసుల వారు మూల వేదమును వివిధ వేదములు గా విభజించారు అనే వాస్తవము ప్రక్కన పెట్టకూడదు. ఆయన అప్పటికే ఉన్న మూల వేదమును వివిధ అంశముల ప్రాతిపదికగా వేరు వేరు వేదములుగా విభజించియున్నారు.  సామవేదము ఋగ్వేదమునకు సంగీత రూపమే. అనగా సామవేదము ఋగ్వేదము రెండింటిని వేరు వేరు వేదములుగా కాకుండా ఒకే వేదముగా గుర్తించాలి.

photo 2 1
“ప్రాచీన భారతీయులకు అక్షర సుమాంజలి (వేద కాల సమాజము)

నేను రచించిన ఈ “ప్రాచీన భారతీయులకు అక్షర సుమాంజలి (వేద కాల సమాజము)” అను పుస్తకము యొక్క విశేషములు తెలియజేసే పేజీ లోకి వెళ్ళడానికి, పుస్తకము కొనడానికి బుక్ ఫోటో పై క్లిక్ చెయ్యండి. వెల రు. 499/-

లేదా

పుస్తకమును అమెజాన్ ద్వారా కొనుగోలు చేయుటకు ఈ లింకు పై క్లిక్ చెయ్యండి. https://www.amazon.in/dp/B0CTSP19X3?ref=myi_title_dp

నా వీడియోలను యుట్యుబ్ లో తిలకించండి

బ్రహ్మావర్తము

ఆర్యజాతి వాదము

సరస్వతి నది ఆచూకీ

చతుర్వేదములు

అప్పుడు వేదముల సంఖ్య మూడు అవుతుంది. వేదములను చతుర్వేదములు అని కాకుండా త్రయీ అని పిలవడానికి కారణమిదే అయి‌ఉంటుంది. అథర్వణ వేదమును మినహాహించి మిగిలిన మూడు వేదములను త్రయీ అనకుండా సామవేదమును ప్రక్కకుపెట్టి మిగిలిన అథర్వణ, ఋగ్ మరియు యజుర్ వేదములను త్రయీ అంటే సమంజసముగా ఉంటుంది…..

ఋగ్వేదము

అథర్వణ వేదము లో లాగానే ఋగ్వేదములో కూడా ఔషధములగురుంచి, మణుల గురుంచిన ప్రస్థావన ఉంటుంది గాని భౌతిక విషయముల ను గురించిన చర్చ తక్కువ. ఏ శ్లోకములు యజ్ఞ క్రతు నిర్వహణ సమయములో పఠించాలో ఆ శ్లోకములు మాత్రమే ఋగ్వేదములో కూర్చి సంకలనము చేశారు. అథర్వణ వేదములోను ఋగ్వేదములోను ఆయా వేదములలోని ఆరవ వంతు శ్లోకములు రెండింటిలోను ఉంటాయి. ఋగ్వేదము ఋక్కులతో నిండి ఉంటుంది.

ఈ ఋక్కులను దేవీలను, దేవుళ్ళను ప్రసన్నము చేసుకోవడానికి పూజా ప్రకియలో పఠిస్తారు. ఒక ప్రక్క యజ్ఞ ప్రక్రియకు అవసరమయిన యజుర్వేదములోని శ్లోకములను ఉద్ఘాటిస్తూనే మరోప్రక్క ఋగ్వేద శ్లోకములు పఠించడము జరుగుతుంది. అనగా ఋగ్వేద శ్లోకములు దేవతలను ప్రసన్నము చేసుకోవడానికి, భక్తులు తమ అభ్యర్ధనలను విన్నవించుకోవడానికికూర్చిన, సంకలనము చేసిన  శ్లోకములు అని గ్రహించాలి.

    ఋగ్వేదమునకు అథర్వణ వేదమునకు వ్యత్యాసము పై చర్చలో కొంతవరకు అవగాహనకు వచ్చినది.

దైవారాధన అంశములు రెండింటిలోను కలవు. లౌకికాంశములు రెండింటిలోను కలవు. తమ తమ ఋక్కులలో ఆరవవంతు రెండింటిలోను కలవు. అథర్వణ వేదము భౌతిక పరిజ్ఞానము కలుగ జేసే వేదము మరియు మానవుని స్వీయ కర్తవ్యమును ఉసిగొల్పే వేదము అయితే, ఋగ్వేదము దైవ సహకారముకొరకు ఛందో బద్దమయిన సంస్కృతమును దైవములకు సమర్పణగా ఉపయోగించే ఉపకరణ వేదము అయి ఉన్నది.

ఈ పాఠము నేను పరిశోధించి రచించిన “పాచీన భారతీయులకు అక్షర సుమాంజలి ” అను పుస్తకములోనిది. అధ్యాయము  2,  ‘ వేద సంపద’

……..ఋగ్వేదములో కూడా అంజనముల గురించిన ప్రస్తావన ఉంది. ఈ క్రింది శ్లోకములు చూడవలెను.

అఞ్జన్తి త్వామాధ్వరే దేవయన్తో వనస్పతే మధునా దైవ్యేన

యదూర్థ్వస్తిష్ఠా ద్రవిణేహ ధత్తాద్యద్వా క్షయో మాతిరస్యా ఉపస్థే

(శ్లోకం  1, సూక్తం  8, మండలం 3, ఋగ్వేదం )

     ఋగ్వేదములోని పై శ్లోకము అంజనములలో గల దివ్య శక్తులను గుర్తించి మానవాళికి తెలియజెప్పిన అథ్వర్యు ఋషికి నివాళులు అని చెబుతుంది.

అప్సు మే సోమో అబ్రవీదం తర్విశ్వాని భేశజా |

అగ్నిం చ విశ్వశభువమాపశ్చ విశ్వభేషజీః

(శ్లోకం  20, సూక్తం  23, మండలం  1, ఋగ్వేదం ).

    సోమ రసము విశ్వభేషజము (వైద్యమునకు ఉపయోగించే ఔషధము) అని కీర్తిస్తున్న శ్లోకమిది.

నా ఈ వ్యాసాలను కూడా చదవండి

ఇక ఋగ్వేదము పది మండలములుగా విభజించబడినది. ఈ వేదమును ప్రధానముగా అంగీరస, కణ్వ, వశిష్ట, విశ్వామిత్ర, అత్రి, భృగు, కష్యప, గృత్సమద, అగస్త్య, భరత మొదలయిన ఆది‌ఋషులు మరియు వారి సాంప్రదాయములోని ఋషుల వ్రాశారు. ఋగ్వేదములోని ఋక్కులు విశ్వము గురించి ప్రాచీన మానవుని చింతనను ప్రతిబింభిస్తాయి. దేవుళ్ళను ప్రశంసనాత్మకముగా స్తుతించే శ్లోకములు ఋగ్వేదములో ఎక్కువగా ఉంటాయి.

ఋగ్వేదములోని ఋక్కులను యజ్ఞ కాండ నిర్వహణ సమయములో పఠించడము  సాంప్రదాయము. ఈ ఋక్కులు ఎక్కువగా జగతి, త్రిష్టుభ్, విరజ్, గాయత్రి, అనుష్టుభ్ అనే ఛందస్సుల నియమములతో కూర్చబడినవి. ఈ ఋక్కుల ఉచ్ఛరించేటప్పుడు వచ్చే శబ్దములు దేవతలను ఆనందపరుస్తాయని, దేవతల  యొక్క అనుగ్రహము పొందడానికి ఇది ఒక మార్గమని నమ్మకము. …..

అథర్వణ వేదము

అథర్వణ వేదము మానవుని వ్యక్తిగత, కుటుంబ, సామాజిక బాధ్యతల నిర్వహణను ఒక యజ్ఞముగా చెబుతుంది.  ఎలానంటే భగవద్గీతలోని శ్రీ కృష్ణుని వచనములలాగా, “నీవు చేసే కర్మకు నీవు కర్తవే గాని ఫలితమునకు కాదు. అలా అని నీ కర్తవ్యము నిర్వహించడము నీవు మాన రాదు.”  అథర్వణ వేదములో ఋగ్వేదములోవలెనే దేవుళ్లను, దేవతలను ప్రస్తుతిసున్న శ్లోకములు కోకొల్లలు గా ఉంటాయి. ఇంద్రుడు, వరుణుడు, మిత్ర, రుద్ర, శివ, దేవి, సరస్వతి, అగ్ని, అర్యమ, విశ్వానర, మారుత, మొదలుగా గల వివిధ దైవములను అథర్వణ వేదము ప్రస్తుతిస్తుంది…..

ఈ పాఠము నేను పరిశోధించి రచించిన “పాచీన భారతీయులకు అక్షర సుమాంజలి ” అను పుస్తకములోనిది. అధ్యాయము  2,  ‘ వేద సంపద’

 అయితే ఇప్పుడు అథర్వన వేదమును పూర్తిగా మనము మరచిపోవడానికి కారణము ఏమై ఉంటుంది?  అథర్వణ వేదములోని వివిధ అంశములను ఎత్తుకొని వివిధ గ్రంధములు ఉద్భవించి విరచితము అవడమువలన అని గ్రహించవలెను.  అంతే కాని దాని  ప్రాబల్యము తగ్గిపావడమువలన కాదు.

ప్రాచీన వైద్యులయిన శుస్రూతుడు, ధన్వంతరి వారి వారి పుస్తకములలో అథర్వణవేదమునుండి వారు ఎన్నో ఔషధముల గురించి, వైద్యము గురించి తెలుసుకున్నామని చెప్పియున్నారు. మను స్మృతిని  గాని చాణక్యుని అర్ధశాస్త్రమును గాని, ఆయన నీతి శాస్త్రములు గాని చదువుతుంటే మనకు అథర్వణ వేదములోని అంశములు గుర్తుకు రావడము ఖాయము. వాస్తుశాస్త్రమునకు అథర్వణ వేదము మూలము అని వేరే చెప్పనక్ఖరలేదు. ​….

* * *

ఔషధములు ఆయుర్వేదము

సిన్ధోర్గర్భో సి విద్యుతాం పుష్పమ్

వాతః ప్రాణః సూర్యశ్చక్షుర్దివస్పయః

  (శ్లోకం ౪౮౯౦  u0026amp;  ౪౮౯౧  సూక్తం 44, కాండ 19)

“నీటిలోనుండి విద్యుత్తులాగా ప్రభవించే ఈ ఓషధి దృష్టిని  కలుగజేయును,  వాతరోగమును హరించును, ప్రాణప్రదాయినిగా పనిచేయును.” (తామర పువ్వు కావచ్చు)

ఉద్యన్నాదిత్య: క్రిమీన్ హన్తు నిమ్రోచన్ హన్తు రశ్మిభి: యే అన్త: క్రిమయో గవి        ( స్లోకం 330 )

    “పశువులలోను, మానవశరీరములలోను నెలకొనియున్న వ్యాధి కారక క్రిములను సూర్యరశ్మి   నశింపజేయును.”

దర్భ గడ్డి (కుశ గ్రాసం):

ఛింధి దర్భ సపత్నాన్ మే ఛిన్ధి మే పృతనాయతః

ఛిన్ధి మే సర్వాన్ దుర్హార్దాన్ ఛింధిమే ద్విషతో మనే

కృన్త దర్భ సపత్నాన్… పింశ దర్భ సపత్నాన్..

    “దర్భ గడ్డి శత్రువులను చీల్చి ఛెండాడుతుంది, వారిని పిండి పిండి చేస్తుంది. ఇది ఒక ( దివ్య శక్తులు గల ) మణిలా పనిచేస్తుంది.

ఈ పేజీలు  కూడా చదవండి

మహాత్మా గాంధీ 1869-1915

జవహర్‌లాల్ నెహ్రూ 1889-1940

డా. సర్వేపల్లి రాధాకృష్ణన్

మోక్షగుండం విశ్వేశ్వరయ్య

Scroll to Top