మణిద్వీప వర్ణనము

మణిద్వీప వర్ణన సూక్తము దేవీ భాగవతం నుండి తీసుకోబడింది. ఇది పురాణ కాలంలో భారతములో ఉన్న ముత్యాలు, వజ్రాలు, బంగారం మరియు సంపదలతో కూడిన ద్వీపాన్ని గురించి వివరిస్తుంది.

మణిద్వీప వర్ణనము

మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని

మణిద్వీపములో మంత్రరూపిణి మన మనస్సులలో కొలువైయుంది   1

సుగంధ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణపూలు

అచంచలంబగు మనోసుఖాలు మణి ద్వీపానికి మహానిధులు  2

లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు

లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహనిధులు 3

పారిజాత వన సౌగంధాలు సురాధినాధుల సత్సంగాలు

గంధర్వాదుల గాన స్వరాలు మణిద్వీపానికి మహానిధులు  4

Book “ప్రాచీన భారతీయులకు అక్షర సుమాంజలి (వేద కాల సమాజము)”
Book “ప్రాచీన భారతీయులకు అక్షర సుమాంజలి (వేద కాల సమాజము)”

నా ఈ పుస్తకమును చదువదలచిన వారు నా సెల్ ఫోన్ నంబర్ 9866357268 కు Phone Pay ఫోన్ పె ద్వారా రు. 450/- పంపించి పోస్టల్ అడ్రసు తెలియ జేస్తూ వాట్మెసాప్ మెసేజ్ పెడితే పోస్ట్ ద్వారా పుస్తకము పంపబడును.

లేదా

పుస్తకమును Amazon అమెజాన్ ద్వారా కొనుగోలు చేయుటకు ఈ లింకు పై క్లిక్ చెయ్యండి. https://www.amazon.in/dp/B0CTSP19X3?ref=myi_title_dp అమెజాన్ ద్వారా వెల రు. 450/-

భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం

దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యం

పద్మరాగములు సువర్ణమణులు పదిఆమడల పొడవున గలవు

మధుర మధురమగు చందన సుధలు మణిద్వీపానికి మహానిధులు  5

అరువది నాలుగు కళామతల్లులు వరాలనొసగే పదారుశక్తులు

పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు  6

అష్టసిద్ధులు నవనవ నిధులు అష్టదిక్కుల దిక్పాలకులు

సృష్టికర్తలు సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు  7

కోటి సూర్యుల ప్రచండకాంతులు కోటిచంద్రుల చల్లని వెలుగులు

కోటి తారకల వెలుగు జిలుగులు మణిద్వీపానికి మహానిధులు  8

నా వీడియోలను యుట్యుబ్ లో తిలకించండి

భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం

దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యం

కంచుగోడల ప్రాకారాలు రాగిగోడల చతురస్రాలు

ఏడామడల రత్నరాసులు మణి ద్వీపానికి మహానిధులు  9

పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు

ప్రపంచమేలే ప్రజాధిపతులు మణి ద్వీపానికి మహానిధులు  10

ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపు కోటలు వైఢూర్యాలు

పుష్యరాగమణి ప్రాకారాలు మణి ద్వీపానికి మహానిధులు  11

సప్తకోటి ఘన మంత్రవిద్యలు సర్వశుభప్రద ఇచ్చాశక్తులు

శ్రీగాయత్రీ జ్ఞానశక్తులు మణి ద్వీపానికి మహానిధులు  12

భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం

దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యం

మిలమిలలాడే ముత్యపురాసులు తళతళలాడే చంద్రకాంతములు

విద్యుల్లతలు మరకతమణులు మణిద్వీపానికి మహానిధులు  13

కుబేర ఇంద్ర వరుణదేవులు శుభాలనొసగే అగ్నివాయువులు

భూమి గణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు  14

భక్తి జ్ఞాన వైరాగ్యసిద్దులు పంచభూతములు పంచశక్తులు

సప్తఋషులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు  15

Lalita Tripura Sundari sitting on Manidweepa
Lalita Tripura Sundari sitting on Manidweepa

నా ఈ వ్యాసాలను కూడా చదవండి

కస్తూరి మల్లిక కుందవనాలు సూర్యకాంతి శిలమహాగ్రహాలు

ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిదులు  16

భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం

దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యం  

మంత్రిణి దండిని శక్తిసేనలు కాళికరాళి సేనాపతులు

ముప్పది రెండు మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు  17

సువర్ణరజిత సుందరగిరులు అనంతదేవీ పరిచారికలు

గోమేధికమణి నిర్మిత గుహలు మణిద్వీపానికి మహానిధులు  18

సప్తసముద్రము లనంత నిధులు యక్షకిన్నెర కింపురుషాదులు

నానాజగములు నదీనదములు మణిద్వీపానికి మహానిధులు  19

మానవ మాధవ దేవగణములు కామధేనువు కల్పతరువులు

సృష్టిస్థితిలయ కారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు  20

భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం

దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యం

కోటి ప్రకృతుల సౌందర్యాలు సకలవేదములు ఉపనిషత్తులు

పదారు రేకుల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు  21

దివ్య ఫలములు దివ్యాస్త్రములు దివ్య పురుషులు ధీరమాతలు

దివ్య జగములు దివ్య శక్తులు మణిద్వీపానికి మహానిధులు 22

శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు

మణి నిర్మితమగు మండపాలు మణిద్వీపానికి మహానిధులు  23

పంచభూతములు యాజమాన్యాలు ప్రవాళసాలం అనేకశక్తులు

సంతాన వృక్ష సముదాయాలు మణిద్వీపానికి మహానిధులు  24

భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం

దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యం

చింతామణులు నవరత్నాలు నూరామడల వజ్రరాసులు

వసంతవనములు గరుడపచ్చలు మణిద్వీపానికి మహానిధులు

ఈ పేజీలు  కూడా చదవండి

ధుఃఖము తెలియని దేవీసేనలు నటనాట్యాలు సంగీతాలు

ధనకనకాలు పురుషార్ధాలు మణిద్వీపానికి మహానిధులు  26

పదునాలుగు లోకాలన్నిటిపైన సర్వలోకమను లోకము గలదు

సర్వలోకమే ఈ మణిద్వీపము సర్వేశ్వరికది శాశ్వతస్థానం  27

చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచముపైన

మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపములో  28

భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం

దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యం

మణిగణ ఖచిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి

సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణిద్వీపములో  29

పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్చించినచో

అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది  30

నూతన గృహములు కట్టినవారు మణిద్వీప వర్ణన

తొమ్మిదిసార్లు చదివిన చాలు అంతా శుభమే అష్టసంపదల తులతూగేరు

శివకవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణిద్వీప వర్ణన చదివినచోట

తిష్ట వేసుకొని కూర్చొనునంటా కోటి శుభాలను సమకూర్చుకొనుటకై

భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం 

దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యం