ప్రాచీన భారతీయులకు అక్షర సుమాంజలి

ప్రాచీన భారతీయులకు అక్షర సుమాంజలి

గ్రంధ రచయిత డి వి ఎస్ జనార్ధన్ ప్రసాద్ గత కొన్ని సంవత్సరములుగా వివిధ సంస్కృత గ్రంధములయిన వేదములు, పురాణములు, ఇతిహాసములయిన రామాయణ భారతములు మరియు మను స్మృతి, యాజుష స్మార్త, కల్ప సూత్రములు, పానిణీయ శిక్ష, వ్యాకరణము, ఛందస్సు తదితర గ్రంధములను సంస్కృతములో పఠించి ఈ పుస్తకము రచించియున్నారు. పురాణేతిహాసములలోని సంఘటనలకు, వ్యక్తులకు చారిత్రకత కల్పించాలనే దృఢ సంకల్పముతో రచయిత పరిశోధనలు జరిపి ఆ ఫలితములను పుస్తకరూపములో విడుదల చేశారు.

ఈ పుస్తకములో షుమారు 240 సంస్కృత శ్లోకములు ఉటంకించబడినవి. శ్లోకములకు తెలుగులో తాత్పర్యములు ఇవ్వడమయినది. మరియు సందర్భానుచితముగా 22 మ్యాప్ లు 58 చిత్రములు ఈ పుస్తకములో వాడబడినవి. ఈ పుస్తకములో 49 అధ్యాయములు,  215 పేజీలు కలవు.

ఈ పుస్తకములో కొన్ని ప్రధాన అంశములు ఇచ్చట పాఠకులకు సంగ్రహపర్చడమయినది.

1.       ప్రస్తుతము సింధులోయలో గల హరప్పా నగరమే పూర్వపు అయోధ్యా నగరమని అదియే కోసల రాజధాని అని, అపరాజితము కూడా ఈ హరప్పానేనని, జాతక కథలలో ఉటంకించిన సార్థక నగరము కూడా ఈ హరప్పానగరమేనని రచయిత చెబుతున్నారు. ప్రస్తుత రావి నదియే అసలు సరయూ నది అని సంస్కృత శ్లోకములను ఉటంకిస్తు నిరూపిస్తున్నారు. భౌగోళీకము మ్యాప్ లను, రామాయణములోని శ్లోకములను, జాతక కథలను ఈ అంశములను నిరూపణచెయ్యడానికి రచయిత ఉపయోగించారు.

2.       హరప్ప త్రవ్వకములలో దొరికిన పశుపతి శివ ఫలకములో యోగ ముద్రలో కూర్చుని ఉండే వ్యక్తి శివుడు కాదని అతను బ్రహ్మ ప్రజాపతి అని రచయిత వివిధ ఆధారములతో వివరించారు.

నా వీడియోలను యుట్యుబ్ లో తిలకించండి

బ్రహ్మావర్తము

ఆర్యజాతి వాదము

సరస్వతి నది ఆచూకీ

3.       సింధు లోయలోని పురాతన నగరమయిన మొహెంజో దారోలో పురావస్తు త్రవ్వకములలో బయటపడిన గ్రేట్ బాత్ అనే తటాక కట్టడము చరిత్రకారులు భావిస్తున్నట్లు పుణ్య స్నానములాచరించడానికి ఉపయోగించిన కొలను కాదని రచయిత చెబుతున్నారు. ఆ కృత్రిమ కొలను లక్ష్మీ దేవి యొక్క లేక సరస్వతీ దేవి యొక్క ఆరాధనకు ఉపయోగించిన తటాకమని రచయిత వివిధ ఆధారములు చూపుతూ వివిరిస్తున్నారు.

4.       పురావస్తు త్రవ్వకములలో లభించిన ప్రీష్ట్ కింగ్ అని పిలువబడుతున్న సున్నపురాయి కళాఖండము బ్రహ్మ ప్రజాపతి యొక్క బొమ్మ అని రచయిత చెబుతున్నారు. ఇప్పటి భారతీయులు వివాహసమయములో ధరించే బాసికము సింధులోయవాసులవద్దనుండి మనకు ఆచారముగా వచ్చినదని, అలాగే చేతి దండలకు తాయెత్తులు కట్టుకునే ఆచారముకూడా వీరినుంచే మనకు సంక్రమించినదని రచయిత చెబుతున్నారు. ప్రీష్ట్ కింగ్ కు గల అలంకారములను రచయిత చూపుతూ వివిరంచి ఈ అంశములను నిరూపిస్తున్నారు.

5.       పురాణములలో కొనియాడబడిన త్రిపురములు మిధ్యకాదని, కల్పితములు కాదని అవి భూమిపై అదియును సింధులోయలో ప్రాచీన కాలములో విలసిల్లిన మూడు నగరములని రచయిత చెబుతున్నారు. పురాణములలోని అంశములను, ప్రాచీన సప్త సింధులోయలోని భౌగోళిక ఉనికిని బేరీజు వేస్తు ప్రస్తుత హరప్ప, గన్వేరీవాలా, మొహంజోదారో నగరములే పూర్వపు త్రిపురములని మ్యాప్ ల సహాయముతో నిరూపిస్తున్నారు. మన రచనలలో ఎక్కడా కూడా ఈ నగరముల పేర్లు ఇవ్వలేదని అయితే అవి వరుసగా అయోధ్య, వైజయంతము మరియు మెలుహా లేక అలకాపురి లేక లంకా నగరములని రచయిత చెబుతున్నారు.

6.       రుద్రుల విషయములో రచయిత కొన్ని క్రొత్త అంశములను తెరపైకి తెస్తున్నారు. రావణుడు, రాముడు ఇద్దరు కూడా రుద్రుల వ్యవస్థలోని వ్యక్తులేనని, అయితే రావణుడు రాక్షసులతో చేతులుకలిపి బ్రహ్మపై కాలుదువ్వాడని, రాముడు బ్రహ్మను రక్షించడానికి ఉద్యుక్తుడయిన రుద్రుడని రచయిత చెబుతున్నారు.

7.       రుద్రులు బ్రహ్మ యొక్క రక్షక భటులని బ్రహ్మ వ్యతిరేకులు కాదని రచయిత చెబుతున్నారు.

8.       సరస్వతీ నదిని ఖచ్చితముగా ఆధారములతో గుర్తించగలిగానని రచయిత చెబుతున్నారు. ప్రస్తుత సింధు నదియే పూర్వపు సరస్వతీ నది అని ఆయన వివిధ ఆధారములతో నిరూపిస్తున్నారు. ప్రస్తుతము సరస్వతీ నదిగా భావిస్తున్న ఘగ్గర్ హక్కర్ నది అసలు దృషద్వతీ నది అని రచయిత చెబుతున్నారు. అలాగే ప్రస్తుత షట్లజ్ నది పూర్వపు యమునా నది అని చెబుతున్నారు.

9.       ఋగ్వేదములో ప్రముఖముగా ప్రస్తావించిన సుదాసు యుద్ధములు 2300 బీసీలో జరిగినవని రచయిత ఒక కాల నిర్ణయము చేయుచున్నారు. వేదములలో ఉటంకించిన సంఘటనకు కాల నిర్ణయము చెయ్యడము ఇది తొలి ప్రయోగమని రచయిత చెబుతున్నారు. ప్రాచీన పారశీకులు సుదాసు సమయములోనే ఇండియాకు వచ్చారని అందుచేత పారశీకుల తొలి ఆగమనము 1900 బీసీ కాదని 2300 బీసీ అని రచయిత  వేదములలోని  కొన్ని శ్లోకములను ఉటంకిస్తు చెబుతున్నారు. అట్లాగే రాముడు సుదాసు తరువాత రాజ్యమేలిన వాడని అందుచేత రామాయణము 2100 బీసీ ప్రాంతములో జరిగిఉంటుంది అని ఇవన్ని త్రేతాయుగములో జరిగినవని రచయిత చెబుతున్నారు.

10.      సంస్కృత భాష యొక్క ప్రశస్థిగురించి ఒక అధ్యాయము, వేద ఛందస్సుకు మరొక అధ్యాయము పుస్తకములో కేటాయించడమయినది.

11.      సనాతన ధర్మమంటే ఏమిటో వివిధ అధ్యాయములో వివిరించారు. బ్రహ్మ, రుద్రులు, శివుడు, దేవీమాతలు మొదలయిన వారందరు అఖండ బ్రహ్మచారులని వీరికి భౌతిక వారసులు ఉండడము అసంభవమని, ఋషుల నామములననుసరించి ధరిస్తున్న గోత్ర నామములు కృత్రిమమని చెబుతున్నారు. అయితే ఋషులవ్యవస్థ వాస్తవమని, ఋషుల పుత్రులుగా చెప్పబడుతున్నవారు నిజానికి బ్రహ్మ మానస పుత్రులని వీరు ఋషుల పరిజ్ఞానమును తరతరాలుగా కాపాడుతూవస్తున్న శిష్య గణములని రచయిత చెబుతున్నారు. అలాగే విగ్రహారాధన్ సనాతన ధర్మములో అంతర్భాగమని, సీత, అహల్య మొదలయిన వారందరనిప్రాచీన భారతీయులు  ప్రతిమ రూపములలోనే కొలిచారని రచయిత చెబుతున్నారు.

12. ఋషులు బ్రహ్మచర్య నియమములను పాటించడమువలన దైవకృపను పొందగలిగారని అందుచేతనే వేదరచన చెయ్యగలిగారని రచయిత చెబుతున్నారు. దైవమును ఆవాహనము చెయ్యగలిగే శక్తి వేద ఛందస్సులో నిగూఢమయి ఉన్నదని రచయిత చెబుతున్నారు.

Published by:

Author, writer, researcher, editor,

Email: janardhanprasaddvs@gmail.com,

©

D V S Janardhan Prasad,

BE, LLB, MA (History), MA (Sociology), MA (Astrology)

D No. 14-6-1/3, Near to Electric Guest house,

Mogultur road,

NARASAPURAM -53275,

W G Dt., AP

13.      ప్రస్తుత సామాజిక వ్యవస్థకు పూర్వపు వ్యవస్థకు పోలిక సరికాదని, ప్రస్తుతము సూద్ర కులములుగా ముద్రవెయ్యబడుతున్న వర్గములవారు నిజానికి ప్రాచీన సామాజిక కొలబద్దతో చుస్తే  వైశ్వానరులని, ప్రస్తుతము శూద్ర కులములు లేనేలేవని చెబుతున్నారు.

14.      బుద్ధుని బ్రాహ్మణ వ్యవస్థకు వ్యతిరేకముగా ఉద్భవించిన ప్రవక్తగా చెప్పడము సరికాదని, బుద్ధుడు బ్రాహ్మను అనుకరించి నిజానికి సనాతన ధర్మమును ఉద్ధరించినవాడని రచయిత చెబుతున్నారు.

వేదములలోని పురాణేతిహాసములలోని యుగ పురుషులకు, సంఘటనలకు చారిత్రకత కల్పించే ఉద్దేశ్యముతో పరిశోధనలు జరిపి డి వీ ఎస్ జనార్ధన్ ప్రసాద్  ” ప్రాచీన భారతీయులకు అక్షర సుమాంజలి”(వేద కాల చరిత్ర)​ అను ఈ పుస్తకమును వ్రాయడమయినది. ఈ పుస్తకము కొనడానికి ఈ క్రింది పుస్తక చిత్రములపై క్లిక్ చెయ్యవలెను. ​​​

ఈ పేజీలు  కూడా చదవండి

మహాత్మా గాంధీ 1869-1915

జవహర్‌లాల్ నెహ్రూ 1889-1940

డా. సర్వేపల్లి రాధాకృష్ణన్

మోక్షగుండం విశ్వేశ్వరయ్య

ఈ పుస్తకములో మొత్తమునకు 49 అధ్యాయములు, 215 పేజీలు కలవు. మరియు 240 సంస్కృత శ్లోకములకు తెలుగు తాత్పర్యములు ఇవ్వబడినవి. ఇంకను 22 మ్యాప్ లు, 57 చిత్రములతో విషయములను వివరించడమయినది. ఒక పుస్తకము వెల రు. 350/- విదేశములకు పంపడానికి ధర రు. 9 డాలర్లు.

Picture

విషయ సూచిక                పేజీ నం.

1.    ఉపోద్ఘాతము                                        1    

2.    వేద సంపద                                         6     

3.    ఆయన పశుపతి కాదు బ్రహ్మ ప్రజాపతి       19    

4.    బ్రహ్మ ప్రజాపతి                                    23     

  5.    పవిత్ర కొలను                                      28   

6.    ధర్మదేవత నందీశ్వరుడు                          31   

7.    గాంధి గారి వానరముల బొమ్మలు.              35   

8.    త్రిపురములు ( మొదటి భాగము )            37  

9.    సప్త సింధు నదులు                                42    

10.    పునర్నవస్య సనాతనమ్                       52   

11.    ప్రళయము                                       59   

12.    లంకా నగరము                                   60    

13.    కుబేరుడు                                            66      

14.      వాస్తు శాస్త్రము                                 70   

15.    వైజయంతము                                   72  

16.    అపరాజితము                                  87 

17.    త్రిపురములు (రెండవ భాగము)               89  

18.    చతుర్యుగములు (మొదటి భాగము)            91   

19.    బ్రహ్మచర్య వ్రతము                                  94        

20.    విద్యార్ధి – బ్రహ్మచారి                         97

21.    గృహస్థాశ్రమ ధర్మము                          99   

22.    సంస్కృత భాష                                     101    

23.    వేద ఛందస్సు                                    105  

24.    గాయత్రి మంత్రము                               108  

25.    సనాతన ధర్మము                                  110  

26.    బ్రహ్మ సనాతనము                                 114    

27.    రుద్రుల వ్యవస్థ                                      119    

28.    దేవీ మాతలు                                      124  

29.    త్రయంబకేశ్వరి                                     127 

30.      సప్త మాతరం                                    129 

31.    సీతా దేవి                                             132   

32.    వైశ్వానరులు                                         136    

33.    సూతులు మరియు మాగధులు                   143   

34.    మారుత గణములు                                   148    

35.    దాశుషేల వ్యవస్థ                                     152   

36.    సుదాసు యుద్ధములు                               156    

37.    శ్రీరామ చంద్రుడు                                     161  

38.    శివ పరమేశ్వరుడు                                    167    

39.    లక్ష్మణుడు                                            173     

40.    దేవ గణములు                                        176      

41.    వరుణుడు                                          179

42.    ఇంద్రుడు                                             182

43.    సప్త ఋషులు                                      184

44.    మానవ జాతులు, సంస్కృతులు                   186  

45.    యక్ష, గంధర్వ, కిన్నెర జనులు                   188 

46.    పర్శవ జనులు                                        194  

47.    నాగ లోకము                                          198  

48.    చతుర్యుగములు (రెండవ భాగము.)          200  

49.    భారతీయ సమాజ పరిణామ క్రమము        207  

Scroll to Top