హరప్పానే ప్రాచీన అయోధ్య

ఈ వ్యాసములో ప్రస్తుతము రావినది ఒడ్డునగల హరప్పానే ప్రాచీన అయోధ్య అని తెలుసుకోగలరు….

కోసల రాజ్యం

దశరథుని రాజ్యము పేరు కోసల. కౌసల్య కోసల రాజ్య పట్టపు మహిషి. కైకేయి రాముని సవతి తల్లి, మరియు భరతుని స్వంత తల్లి. కోసలకు రాజధాని అయోధ్య. అయోధ్యకు సార్థక అని, అపరాజిత అని కూడా పేర్లు కలవు. ఈ పట్టణము సరయూ నదీ తీరమున ఉండేది. దీని అసలు పేరు అమరావతి అని, ఇదియే దేవలోకమని కూడా ఈ అధ్యాములోనే మనము తెలుసుకోగలము. ​(ఈ పాఠము నేను పరిశోధించి రచించిన “పాచీన భారతీయులకు అక్షర సుమాంజలి ” అను పుస్తకములోనిది. అధ్యాయము 16, ’అపరాజితము’)

రామాయణములోని ఈ క్రింది శ్లోకము చూద్దాము,

కోసలో నామ ముదితస్స్పీతో జనపదో మహాన్

వివిష్టస్సరయూ తీరే ప్రభూత ధనధాన్యవాన్

( శ్లోకం ౫,  సర్గ  ౫,  బాల కాండ)

   అర్ధము:     “జనపదములలోకెల్ల ఖ్యాతిగాంచిన కోసలరాజ్యము సరయూ నది ప్రక్కన విలసిల్లి ధనధాన్యములతో తులతూగుతుండెను..

ప్రస్తుతము ఉత్తరభారత దేశములోనున్న అయోధ్య నగరము ప్రక్కగా ప్రవహించే నదిని కూడా సరయూ అని పిలుస్తారు. మునుపటి అధ్యాయములో  ప్రస్తుతము ఉత్తర భారతదేశములో నున్న  కోసలరాజ్యమునకు, కాశీకి దక్షిణములో ఎడారి లేదు కాబట్టి ప్రాచీన అయోధ్య ప్రస్తుత అయోధ్య ఒకటికాదు అని చెప్పుకున్నాము.

Book “ప్రాచీన భారతీయులకు అక్షర సుమాంజలి (వేద కాల సమాజము)”
Book “ప్రాచీన భారతీయులకు అక్షర సుమాంజలి (వేద కాల సమాజము)”

నా ఈ పుస్తకమును చదువదలచిన వారు నా సెల్ ఫోన్ నంబర్ 9866357268 కు Phone Pay ఫోన్ పె ద్వారా రు. 450/- పంపించి పోస్టల్ అడ్రసు తెలియ జేస్తూ వాట్మెసాప్ మెసేజ్ పెడితే పోస్ట్ ద్వారా పుస్తకము పంపబడును.

లేదా

పుస్తకమును Amazon అమెజాన్ ద్వారా కొనుగోలు చేయుటకు ఈ లింకు పై క్లిక్ చెయ్యండి. https://www.amazon.in/dp/B0CTSP19X3?ref=myi_title_dp అమెజాన్ ద్వారా వెల రు. 450/-

నా వీడియోలను యుట్యుబ్ లో తిలకించండి

పురీష్ణి నది యే సరయూ నది

మరి ప్రస్తుత హరప్ప పూర్వపు అయోధ్య కావాలంటే దాని ప్రక్కగా సరయూ నది ప్రవహించాలి కదా!  ఋగ్వేదములోని ఈ క్రింది శ్లోకము చూద్దాము,

మా వో రసానితభా కుభా క్రుముర్మా వః సిన్ఢుర్ని రీరిమత్

మా వః పరిష్టాత్ సరయుః పురీషిణ్యస్మే ఇత్ సుమ్నమస్తు వః

( శ్లోకం  ౫౩,  సూక్తం  ౯,  మండలం  ౫,  ఋగ్వేదం )

( మా = వద్దు; వః = నీవు; పరిష్ట = ఆటంకము; సరయు = సరస్సు, నది; పురీషి = గట్టులు తెంచుకుని ప్రవహించడమువల్ల నది వెడల్పు పెరిగిన స్థితి; ణ్యా = వెనక్కు తగ్గు; అస్మ = మా; సుమ్న = దయ చూపుము; అస్తు = మంచి జరగనీ; వః = యౌ. )

నా ఈ వ్యాసాలను కూడా చదవండి

book review andhra prabha 20.2.17
Book review in Andhra Prabha 20.2.17

పై శ్లోకములో రెండవ పంక్తి తాత్పర్యము వివరణ చూడవలెను. వరద తొందరగా తగ్గిపోవాలని నదీమ తల్లిని ప్రార్ధిస్తున్న శ్లోకమిది. దీని అర్ధము, “గట్లు పైనుంచి ప్రవహిస్తూ సరయు నది నావికుల ప్రయాణాన్ని నిరోధిస్తుంది.” సాధారణముగా వరద సమయములో నదులు గట్లు త్రెంచుకుని పొర్లి పారడమువల్ల నది వడల్పు పెరుగుతుంది. పై శ్లోకములో సరయు  నదియొక్క ఈ రకమయిన స్థితిని పురీషి అని పిలిచారు.   రావి నదికి గల మరో పెరు పురీష్ణి అని చరిత్రకారులు చెబుతారు.

రావి నదియే పూర్వపు సరయు నది

 ప్రస్తుత హరప్ప రావి నది ఒడ్డుననే ఉంటుంది. ఋగ్వేదములో సరయు నదిని పురీషి అని చెప్పారు. అందుచేత మనము ప్రస్తుత రావి నదియే పూర్వపు సరయు అని తెలుసుకుందాము. అలా ప్రస్తుత హరప్పానే పూర్వపు అయోధ్య అని నిర్ధారించవచ్చు.

ఈ పేజీలు  కూడా చదవండి