ఈ వ్యాసములో ప్రస్తుత భారత దేశం మెలుహా కాదు అని ప్రస్తుతం పాకిస్తాను లో ఉన్న మొహెంజోదారో నగరమే పూర్వపు మేలుహా నగరమని తెలుసుకుంటారు.…రామాయణ మరియు మహాభారతములలోను ప్రస్తుతించిన పట్టణములు చాలా ఉన్నాయి. వాటిలో త్రిపురములు, అమరావతి లంక, అయోధ్య, హస్తినాపురము, ఇంద్ర ప్రస్థము మొదలయినవి ప్రముఖమయినవి. లంకా నగరము గురించి రామయణములో చేసినంత ప్రశస్థి వర్ణన మరి యే ఇతర నగరము గురించి కూడా పురాణేతిహాసములలో కనిపించదు.
ఈ పాఠము నేను పరిశోధించి రచించిన “పాచీన భారతీయులకు అక్షర సుమాంజలి ” అను పుస్తకములోనిది. అధ్యాయము 12, అలకాపురి’
ఈ నగరము శ్రీ లంక లో కలదని చరిత్రకారులు మరియు చాలామంది హిందువులు భావించడము కద్దు. పూర్వము శ్రీ లంకకు భారతదేశమునకు మత, రాజకీయ పరమయిన పరస్పర ఇచ్చిపుచ్చుకోవడాలు ఉండడము వాస్తవమే. కాని రామాయణములో లంకను ఒక నగరము అని సంభోదించారు గాని ఒక దీవి అని ఎక్కడా చెప్పలేదు. హనుమంతుడు, వానర సేనలు సముద్రమును దాటి లంకకు వెళ్ళారు అన్నారు నిజమే గాని సంస్కృత భాషలో సముద్రమంటే ప్రస్తుతము మనమనుకునే ఉప్పు సముద్రమే కానక్ఖరలేదు. సముద్రమునకు అర్ధము పెద్ద నది అనికూడా చెప్పవచ్చు.
నా వీడియోలను యుట్యుబ్ లో తిలకించండి
గుజరాత్ లోని బెట్ ద్వారక అనే చోట ప్రాచీన ద్వారకా నగర అవశేషములు కనుగొన్నారు. వాటి వయసు షుమారు ౩౦౦౦ సంవత్సరములు అని తెలుసుకున్నారు. భారత యుద్ధము ౩౦౦౦ – ౩౫౦౦ సంవత్సరముల క్రితము జరిగినట్లు ఈ ద్వారకా పురమును కనుగొన్నందువల్ల మనకు విధితమవుతుంది. పురాణ కాలానుక్రమణము ప్రకారము రామాయణము భారతము కన్న ముందు జరిగినది. అప్పుడు రామాయణమునకు భారతము కన్న ముందు తేదీలు కేటాయించాలి.
రామాయణము భారతమునకు ఒక వెయ్యి సంవత్సరముల ముందు జరిగినదని అనుకుంటే రామాయణము 4500 సంవత్సరములకు పూర్వము జరిగిఉండాలి. ప్రస్థుతము ఉత్తర భారత దేశములో ఉన్న అయోధ్యలో త్రవ్వకములు జరపగా అక్కడ 2600 సంవత్సరములకు ముందు పొరలలో జనావాస ఆనవాళ్ళు కనబడలేదు. ( ఆంటే ప్రస్తుత అయోధ్య నగరము పూర్వపు అయోధ్య కాదన్నమాట. మరి పూర్వపు అయోధ్య నగరము ఎక్కడ ఉండేది అనే విషయము రాబోయే అధ్యాయములలో చర్చిద్దాము. )
లంకా నగరము ఎక్కడ ఉండేది అనే విషయములు ఇక్కడ విచారిద్దాము. అయోధ్యకు దక్షిణ దిక్కులో దండకారణ్యము ఉందని, దండకారణ్యమునకు దక్షిణములో లంక ఉండేదని చరిత్రకారులు నమ్మడమువల్ల ఈ గందరగోళము జరిగినది.
వాస్తవానికి లంకా నగరము అయోధ్యకు దక్షిణములో కాకుండా నైఋతి దిక్కులో ఉందని రామాయణము చెబుతుంది. రాముడు లంకకు ప్రయాణించేటప్పుడు ముందుగా పడమరకు ఆ తదుపరి దక్షిణమునకు పయనించినట్లు ఒక శ్లోకములో విశదమవుతుంది. అనగా లంకా నగరము అయోధ్యకు నైఋతి దిశలో ఉంటుంది. రాముని లంకా ప్రయాణ మార్గము ఎటువైపు సాగిందో….
అర్ధము: “వివిధ ఆకారములలో నిర్మించిన బావులు అక్కడ ఉన్నాయి. ఆ బావులలోని నీరు వ్యాధులను నివారించును. ఆ బావులలోనికి దిగడానికి ఉపయోగించే మెట్లకు వజ్రములు తాపడము చేసియున్నారు.” పైశ్లోకములలోని లంకా పట్టణమును గురించి చేసిన భౌతిక వర్ణనములు భారతదేశములోని మరి ఏ పురాతన నగరమునకు సరి పోలవు. శ్రీలంకలో కూడా ఇలాంటి పట్టణ అవశేషములు కనుగొనలేదు. మొహెన్జొ దారొ పట్టణ అవశేషములు లంకా నగర వర్ణనములకు సరిగా సరి పోలుతున్నవి
నా ఈ వ్యాసాలను కూడా చదవండి
* * *

* * *
అయితే ఈ మెలుహ ఒక దేశమయి ఉంటుందని. అది ప్రస్తుత భారత దేశము కావచ్చని, లేక సింధులోయ ప్రాంతము కావచ్చని చాలమంది చరిత్రకారుల అభిప్రాయము. కాని దేనికయిన శాస్త్రీయత కావాలి కదా! పై చర్చలలో మనము లంక లో హనుమంతుడు ప్రపంచపటమును చూసినట్లు తెలుసుకున్నాము. అలాగే రావణుడు దశగ్రీవుడని, రాజాధిరాజు అని తెలుసుకున్నాము.
ఈ పేజీలు కూడా చదవండి
అలకాపురి
రావణునికి ముందు కుబేరుడు అక్కడ రాజ్యమేలాడు. కుబేరునికి కూడా రాజాధిరాజు అనే బిరుదు ఉంది. రావణుని తరువాత అతని తమ్ముడు విభీషణుడు రాజ్యమేలాడు. ఇంకను వీరి ముందు వెనుక చాలామంది రాజ్యమేలి ఉంటారు. అనగా లంకా నగరము ప్రాచీన కాలములలో అత్యంత వైభవంతమైన పట్టణము అని విశదమవుతుంది. ముందు పరాగ్రాఫ్లో అలకాపురి పేరు లంకాపురి గా ఎలా మారిఉంటుందో తెలుసుకున్నాము. అదే బాణీలో అలకాపురి మెలుహాగా కూడా ఎలా మారిఉంటుందో పదవ్యుత్పత్తి ప్రకారము విశ్లేషించి చూద్దాము.
అలక → అలహ → మలహ → మెలహ → మెలుహా
అంటె అలకాపురి నే మెసపొటామియ వాసులు మెలుహా అని పిలిచారని విశదమవుతుంది. అందుచేత మెలుహ ఒక దేశము కాదు. అది ఒక పట్టణము, అదే లంకా పురి లేక లంకా నగరము.