భరతవర్షం

భరతవర్షం భరతఖండం జంబుద్వీపం

భరతవర్షం అంటే ప్రాచీన కాలంలో పౌరాణిక చక్రవర్తి భరతుడు పాలించిన దేశం అని అర్ధం వస్తుంది. మరియు భరతఖండ్ అంటే భరతవర్షం లో ఒక విభాగము అని అర్ధం చేసుకోవాల్సి ఉంది. మరియు జంబుద్వీపం అంటే ఎలుగుబంట్లు నివసించిన భూమి. (ప్రస్తుత పాకిస్తాను లోని సింధ్ మరియు పంజాబ్ ప్రాంతముల మధ్య భూభాగమే ప్రాచీన జంబుద్వీపము అయి ఉంటుంది అని నేను కనుగొన్నాను.)

హిందువులు పూజలు ప్రారంభించే సమయంలో (సాధారణంగా గణపతి పూజ చేసే ముందుగా) ‘సంకల్ప సూత్రం’ శ్లోకాన్ని ఈ విధంగా పఠిస్తారు.

మమోపాత్త దురితక్షయద్వారా శ్రీ పరమేష్వర ప్రీత్యర్థమ్, శుభే శోభనే ముహూర్తె శ్రీ మహా విష్ణోరాజ్ఞయాప్రవర్తమానస్యాద్య బ్రహ్మణః, ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరె కలియుగే ప్రథమపాదే జంబుద్వీపే భరతవర్షే భరతఖన్డే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానే సంవత్సరే అయనే.. ఋతౌ..

Book “ప్రాచీన భారతీయులకు అక్షర సుమాంజలి (వేద కాల సమాజము)”
Book “ప్రాచీన భారతీయులకు అక్షర సుమాంజలి (వేద కాల సమాజము)”

నా ఈ పుస్తకమును చదువదలచిన వారు నా సెల్ ఫోన్ నంబర్ 9866357268 కు Phone Pay ఫోన్ పె ద్వారా రు. 450/- పంపించి పోస్టల్ అడ్రసు తెలియ జేస్తూ వాట్మెసాప్ మెసేజ్ పెడితే పోస్ట్ ద్వారా పుస్తకము పంపబడును.

లేదా

పుస్తకమును Amazon అమెజాన్ ద్వారా కొనుగోలు చేయుటకు ఈ లింకు పై క్లిక్ చెయ్యండి. https://www.amazon.in/dp/B0CTSP19X3?ref=myi_title_dp అమెజాన్ ద్వారా వెల రు. 450/-

సర్వదమన, రాజా భరత్
సర్వదమన, రాజా భరత్

ఈ శ్లోకంలో ప్రాచీన భారతదేశాన్ని భరతవర్షం, భరతఖండం, జంబుద్వీపం అని ఒకే శ్లోకంలో మూడు పేర్లతో పిలవడాన్ని చూడ వచ్చు. దీనిని బట్టి ఈ మూడు పేర్లలో ఏ ఒక్క పేరు ప్రాచీన భారత దేశాన్ని పూర్తిగా నిర్వచించలేదని తెలుస్తుంది. అలాగే ఈ మూడు పదములు ఒకదానికొకటి పర్యాయపదంగా కూడా వాడవచ్చని గ్రహించాలి.

నా వీడియోలను యుట్యుబ్ లో తిలకించండి

మరియు సింధు అనే పదాన్ని వేదాలలోను మరియు ఇతర హిందూ మత గ్రంథాలలోను నీటిని సూచించడానికి ఉపయోగించబడిందని మనందరికీ తెలుసు. ప్రస్తుతం సింధు అనే పిలువబడే పెద్ద నది ఒకటి హిమాలయాలలో మనసరోవర్ సరస్సు దగ్గర పుట్టి కాశ్మీర్, ఉత్తర పశ్చిమ పాకిస్తాను మరియు సింధు ప్రాంతముల గుండా పయనించి చివరికి అరేబియా సముద్రంలో కలుస్తుంది. మరియు ‘హింద్’ అనే పదం పర్షియన్ పదం అయి ఉంది. సింధ్ నది పరిసర ప్రాంతాల్లోను మరియు భారత దేశం లోని ప్రయాగ వరకు విస్తరించి ఉండే ప్రాంతంలో నివసించే భారతీయులను సూచించడానికి పర్షియన్లు హిందూవులు పిలిచినట్లు తెలుస్తుంది. మరియు గ్రీకులు పురాతన భరతావర్ష ను ఇండియా అని పిలిచారు.

మరియు ప్రస్తుతం స్వాట్ అనే ఒక నది కాబూల్ నదిలోకి ప్రవహిస్తుంది. ఈ రెండు నదుల సంగమ ప్రాంతాన్ని ప్రాంగ్ అని పిలుస్తారు. ప్రాంగ్ పదానికి మన ప్రయాగ పదానికి గల పద సారూప్యతను గమనించండి. అలాగే స్వాత్ పదం సరస్వతి పదానికి దగ్గరగా పలుకుతున్నట్లు గమనించవలెను. ఈ ప్రాంగ్ కు సమీపంలో పుష్కలవతి అని పిలువబడే ఒక పురాతన నగరం యొక్క శిధిలాలను కనుగొన్నారు. ఈ పుష్కలవతి నగరం ప్రాచీన గాంధార రాజ్యానికి రాజధానిగా విలసిల్లినది అని చరిత్రకారుల అభిప్రాయము. ఇప్పుడు కూడా ఈ ప్రాంతాన్ని కంధహార్ అని పిలుస్తారు. మరియు ఈ నగరం భరతుని యొక్క కుమారుడు పుష్కల చేత పరిపాలించ బడింది అని చెబుతారు. 

నా ఈ వ్యాసాలను కూడా చదవండి

మరియు ప్రస్తుత లాహోర్ నగరం శ్రీరాముని కుమారుడు లవుడు పాలించిన లవపురిగా గుర్తించబడింది. మరియు లాహోర్ కు దక్షిణమున కసూర్ అని పిలువబడే ఒక నగరం ఉంది, ఇది రాముని యొక్క మరొక కుమారుడు కుశడు పాలించిన కుషాపురి అని నమ్ముతారు. మరియు కాబూల్‌కు ఉత్తరమున హిందూ కుష్ అని పిలువబడే 500 కిలోమీటర్ల పొడవైన పర్వత శ్రేణి ఉంది.

ఇపుడు ప్రాచీన భరతవర్ష ఎక్కడఉండి ఉంటుంది అని చెప్పగలము? నా అవగాహన ప్రకారం ప్రాచీన భరతవర్షము ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ దేశ భూభాగములు, తూర్పువైపున ప్రయాగ వరకు, ఉత్తరమున హిమాలయాలు మరియు దక్షిణములో ప్రస్తుత దక్షిణ భారతదేశం అంతటా విస్తరించి ఉండి ఉండాలి.

మరి మనుష్యుల యొక్క జీన్లు కంటిన్యూ అవకపోతే మరి ఇంక ఏమి బ్రతికి ఉంటుంది అంటే సమాజము యొక్క సంస్కృతీ సాంప్రదాయములు మాత్రమే ఉనికిలో ఉంది కొనసాగుతూ ఉంటాయి. సంస్కృతి కేవలం జీవసంబంధమైన మార్గాల ద్వారానే కాకుండా, సామాజిక మాధ్యమముల ద్వారా కూడా ఒక తరం నుండి మరొక తరానికి కొనసాగి వ్యాప్తి చెందుతూ ఉంటుంది.

మానవులు జన్మిస్తూ ఉంటారు. గతిస్తూ ఉంటారు. అలాగే సర్వ మానవులకు గల వలస వెళ్ళే సాధారణ గుణము వలస మానవులు ఎల్లప్పుడూ ఒకే ప్రాంతంలో ఉండరు. అలాగే వారి జన్యువులు కూడా భౌగోళిక స్తితి గతులను బట్టి ఆహారపు అలవాట్లను బట్టి పరిణామం చెందుతూ ఉంటాయి. అలాగే ఏ మానవ సమాజమలోనయినా ఎగ్జోగామీ సిద్దాంతం పాటించడం వలన (ఎగ్జోగామీ అంటే ఒక కుటుంబం వారు ఆ కుంటుంబంలో ఒకరి నొకరు వివాహము చేసుకోకూడదు అనే నియమం) నిరంతరం బయటి కులముల నుంచి మానవులు వచ్చి కలుస్తూనే ఉంటారు. అలాగే చరిత్రను ఒకసారి పరికిస్తే ప్రపంచంలో ఎక్కడా కూడా ఒక రాజ వంశం వారు ఐదు లేదా ఆరు తరాలకు మించి మనుగడలో ఉండడం కనబడదు.

ఈ పేజీలు  కూడా చదవండి

అలాగే ఒక్కోసారి మనుష్యులు కొన్ని అపోహలను నమ్మి తప్పుదారి పడుతూ ఉంటారు. కాని నిజం ఎప్పుడూ నికడగా ఉంటుంది. సత్యమేవ జయతే. ఇంగ్లీషు వారు ప్రతిపాదించిన మరియు ప్రస్తుతం చలామణీలో ఉన్న ఆర్య మూల వాదము ఆధారముగా తీసుకుని మనం ఇప్పుడు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మరియు కేరళల రాష్ట్రాలను దక్షిణ భారతదేశం అని పిలుస్తున్నాము. అయితే పురాణాలు వింద్యా పర్వతములకు దక్షిణమున గల ఉన్న భూమిని అంతటిని దక్షిణాపథ్ అని పిలుస్తాయి. అపుడు గుజరాత్ లోని కొంత భాగము, మహారాష్ట్ర మరియు ఒరిస్సా రాష్ట్రాలను కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మరియు కేరళల రాష్ట్రాలతో కలిపి దక్షిణాపథం గా పిలవాల్సి ఉంటుంది.