లోక్ సభ మరియు రాజ్య సభలలో అణు ఒప్పందం విషయమై ప్రభుత్వం చర్చను అనుమతించడంలేదు. మన ప్రజాస్వామ్య వ్యవస్థ కు ఇది మంచిది కాదు. అమెరిక దేశ ఆదేశాలను సిరసా వహించే విదేశాంగ విధానం కేంద్ర ప్రభుత్వం పాటించడానికి ఉర్రూతలూగు తున్నట్లు విధితమవుతుంది. ఢిల్లీ లోని కేంద్ర ప్రభుత్వం అమెరికా తో అణు ఒప్పందం వ్యవహారంలో ఏకపక్షంగ వ్యవహరిస్థున్న తీరు విస్మయం కలిగిస్తుంది.
(ఈ విశేషాంశం గురుంచి ముఖ్యమయిన తెలుగు, ఇంగ్లీషు వార్తా పత్రికులకు, తెలుగు, ఇంగ్లీషు, హింది టి.వి చానళ్ళకు ది 21.09.07 తేదీన పంపించడమయినది.)
ఈ విధానం వల్ల దేశానికి ఏ దుస్థితి వస్థుందొ హెన్రి కిస్సింజర్ అనే పూర్వపు అమెరిక విదేశాంగ శాఖ మంత్రి మాటల్లో చూద్దాం, ఆయన ఏమని చెబుతాడంటె ” అమెరిక దేశం తొ ఏ దేశ మయితే స్నేహం చేస్థుందో ఆ దేశాన్ని అమెరికా సైనికంగ ఆక్రమిస్థుంది”. ఈయన చెప్పిన మాటలు ఎల్లప్పుడు అన్ని దేశాల విషయాలలో నిజమవుతుందని చరిత్ర చెబుతుంది.
అమెరికా తో చేతులు కలిపితే ఏమవుతుందో తెలిసి కూడ ప్రభుత్వం పార్లమెంటును త్రోసిరాజని ఎలా ముందుకు వెళ్ళగలుగుతుంది? ప్రభుత్వానికి ఇంతటి నిరంకుశ అధికారాలు రాజ్యాంగ పరంగ ఎలా దఖలు పడ్డాయో పరిశీలిద్దాం.
భారత దేశం ఒక గణ తంత్ర, ప్రజాస్వామ్య రాజ్యంగ ౧౯౫౦ లొ ఏర్పడింది.
భారత రాజ్యాంగ నిర్మాతల్లో ప్రధాన భూమిక పోషించిన జవహర్ లాల్ నెహ్రు గారు మన ప్రజాస్వామ్య వ్యవస్థ గురుంచి ఏమన్నరంటె , ” మన ప్రజాస్వామ్యం బ్రిటిషు వారి వెస్ట్ మినిస్టర్ వ్యవస్థను పోలి ఉంటుంది”. అంటే, కేంద్ర మంత్రులు, ప్రధాన మంత్రి పార్లమెంటుకు జవాబుదారి గ ఉండాలి.
నా వీడియోలను యుట్యుబ్ లో తిలకించండి
(వాస్థవానికి జవహర్ లాల్ మరియు ఇందిర గాంధి ల హయాంలలో వారు కూడ పార్లమెంటును ప్రక్కకు పెట్టి విదేశీ , దేశ రక్షణ వ్యవహారాలు నడిపి ఉండి ఉండవచ్చు. కాని వారితో ఇప్పటి రాజకీయ నాయకులను పోల్చలేము కదా! నెహ్రు, ఇందిరల దేశ భక్తి ఎప్పటికి తప్పు పట్ట లేనిది. అందుచేత వారి నిర్ణయాలు అప్పట్లో వివాదం కాలేదు కూడ. అప్పటి అంతర్జాతీయ పరిస్థుతులు, బల సమీకరణలు వేరు. అప్పట్లో రష్యా మనకు అండగ ఉండేది.ఉదాహరణకు యు ఎన్ లో ఇంగ్లీషు వారు కాశ్మీరు పై ప్రవేశ పెట్టిన ప్రతి తీరమానాన్ని రష్య వీటో చేస్తు వచ్చేది).
పార్లమెంటరీ ప్రజాస్వామ్యమంటే ఎలా ఉంటుందో ఒక సారి గతంలోకి వెళితే అర్ధమవుతుంది.
౧౯౩౭ లో ఢిల్లీ లో ఎన్నికల ద్వార కేంద్ర చట్ట సభ ఏర్పడింది. ౧౯౩౯ లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలయింది.
ఊహించిన విధంగానే బ్రిటిషు ప్రభుత్వం యుద్ధంలోకి భారత దేశాన్ని లాగింది. అప్పుడు కేంద్ర చట్ట సభ సభ్యులు తమ తమ చట్ట సభ సభ్యత్వాలకు రాజినామాలు సమర్పించారు.
కాంగ్రెసు యుద్ధానికి వ్యతిరేకం కాదు. బ్రిటిషు వారి ఆధీనంలో ఉన్న అప్పటి భారత దేశ ప్రభుత్వం కేంద్ర చట్ట సభను సంప్రదించకుండ జర్మనీ పై యుద్ధం ప్రకటించడం అంటె చట్ట సభలకు ప్రభుత్వ ద్రుష్టి లో విలువ లేదని ప్రభుత్వానికి ప్రజాస్వామ్య వ్యవస్థను భారత దేశంలో స్థాపించడం విషయం లో చిత్తసుద్ధి లేదని దానికి నిరసనగా వారు రాజినామాలు సమర్పించారు.
(ఇప్పటి పరిస్థుతులు వేరు. రష్య దేశం ఆర్ధికంగా కుదేలయి ఉంది. చైనా మనకు వ్యతిరేకమయి మన శత్రువులతో కుమ్మక్కై ఉంది. ఇప్పుడు భారత దేశం నిజంగా ఏకాకిగా ఉంది. అందుచేత విదేశీ వ్యవహారాల్లో న్యూ ఢిల్లీ ఆచి తూచి అడుగు వెయ్యాల్సిన అవసరం ఉంది). 1919 లో భారత దేశం లో పరిమిత ప్రజాస్వామ్యం కోసం కొంత ప్రయత్నం జరిగింది.
అప్పుడు అన్ని అధికారాలు ఇండియాలో గవర్నరు జనరల్ అనే ఇంగ్లీషు అధికారి చేతిలో ఉండేవి. 1919 సంవత్సరంలో ప్రవేశ పెట్టిన కేంద్ర చట్ట సభల అధికారాలను నిర్వచించే టపుడు చట్ట సభల పరిధి నుండి భారత దేశ రక్షణ , విదేశీ వ్యవహారాలు, మత వ్యవహారాలు, విమానయానం , నౌకా దళం – ఈ విషయాలన్ని చట్ట సభల అధికార పరిధి నుండి మినహాయించారు.తరువాత ౧౯౩౫ భారత ప్రభుత్వ చట్టం కూడ పై విషయాలను పార్లమెంటు పరిధినుండి మినహాయించింది.
ALSO READ
- Fundamental rights
- Basic features of the Constitution
- Freedom Movement
- Nasadiya Sukta
- Atharva veda
- Jawaharlal Nehru 1889-1940
- Mahatma Gandhi 1915-1948
ఈ చట్టం ౧౯౪౦ లో కూడ అమలులో ఉంది. అయినాసరే పైన చెప్పిన విధంగా అప్పటి కాంగ్రెసు సభ్యులు రాజనామాలు చేసి దేశానికి ఎలాంటి ప్రజాస్వామ్య వ్యవస్థ మున్ముందు ఉండబోతుందో దేశ ప్రజలకు రుచి చూపించారు అనిమనం గమనించాలి.
మన పూర్వీకులు ఎంతటి ప్రసస్థమయిన ప్రజాస్వామిక విలువలు మనకు వారసత్వంగా ప్రసాదించారు! ఇప్పుడు మనం ఏమి చేస్థున్నాం ? పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం పాలు చేస్థూ ప్రభుత్వం నిరంకుశం గా వ్యవహరిస్థుంటే పార్లమెంటు సభ్యులు కళ్ళప్పగించి చూస్థున్నారు. పార్లమెంటుకు ప్రజలకు విధేయులయి ఉండాల్సిన ప్రజా ప్రతినిధులు రాజకీయపార్టీ ల అధ్యక్షులకు విధేయులయి పదవులను కాపాడుకోవడమే జేవిత పరమావధిగా భావిస్థున్నారు.
ఇక్కడ మరో విషయం గమనించాలి. మన ప్రస్థుత రాజ్యాంగం ఆర్టికల్ ౧౩ ప్రకారం రాజ్యాంగం అమలులోకి వచ్చిన తరువాత పూర్వపు చట్టాలు ఏవయిన రాజ్యాంగ అధికరణాలకు వ్యతిరేకంగా ఉంటే అవి చేల్లవు. అనగా కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంటును తలదన్ననే అధికారాలు ఏమి చెల్లవు.
పార్లమెంటు లో మూడవ వంతు సభ్యులున్న పార్టి దేశ రక్షణ వ్యవహారంలో ఏకపక్ష నిర్ణయం తీసుకొని వ్యవహారం నడిపించడం దేశ రాజకీయ దుస్థితికి నిదర్శనంగా భావించవచ్చు.
ఈ పేజీలు కూడా చదవండి