Dr sarvepalli Radhakrishnan

డా. సర్వేపల్లి రాధాకృష్ణన్

శ్రీ డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ లేక సర్వేపల్లి రాధాకృష్ణయ్య గారు 1927 లో ఆంధ్ర యూనివర్సిటీ లో జరిగిన కన్వోకేషన్ లో ఇలా అన్నారు. “మన ఆంధ్రులము కొన్ని విషయాలలో చాల అదృష్టవంతులమని అనుకుంటున్నాను. భారత దేశ ములో ఎక్కడయినా దేశం ఐక్యంగా ఉండాలని కోరుకుంటున్నారంటే అది మన ఆంధ్రులే. ఆంధ్రులు ఛాందస వాదులు కాదు. ఆంధ్రుల ధాతృత్వము మరియు విశాల దృక్పదము భారతీయులకందరికి తెలిసినదే. మనకు సాంప్రదాయకంగా వారసత్వపు ఆస్థిగా లభించిన సాంఘిక జన జీవన శైలి, నైతిక విలువలు, జాలి, దయ, మొదలయిన మానవత్వ గుణములను మనము విజయవంతముగా కాపాడుకుంటున్నాము.”

డా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు సెప్టెంబరు 5, 1888 లో తిరుపతి దగ్గర గల తిరుత్తని గ్రామములో జన్మించారు. ఆయన తన 19 వ ఏటనే వేదాంతము పై ఒక థీసీస్ ప్రచురించారు. ఆ థీసీస్ ఆయన ఎమ్ ఏ చదువులో భాగము అయి ఉన్నది. తరువాత ఆయన చాలా పుస్తకములు, ప్రచురణలు చేశారు. 

నా వీడియోలను యుట్యుబ్ లో తిలకించండి

బ్రహ్మావర్తము

ఆర్యజాతి వాదము

సరస్వతి నది ఆచూకీ

ఔరంగాబదు హిందుస్థానికి దగ్గరగా ఉంటుంది. అందుచేత హిందుస్థానీలు ( హిందువులు మరియు ముస్లిములు) బంగాలీలు నిజాము కొలువులో ఎక్కువగా ఉండే వారు. 

శ్రీ రాధా కృష్ణయ్య గారి తత్వ విశ్లేషణ అంతా కూడా హిందూ మతము యొక్క ప్రసస్థి పైననే జరిగినది. వేదాంతమును ఆయన హిందూ మతములో భాగముగా కాకుండా వేదాంతము ఒక మతము గా అభివర్ణించారు. ఆయన మిషనరీలగురుంచి ఇలా అన్నారు, 

” నేను మన హిందూ మతములోగల విశేషములు తెలుసుకోవడానికి కారణము హిందు మతమును క్త్రైస్తవ మిషనరీలు విమర్శించడమే. మన మతములో గొప్పదనము ఏమిటి, లోపాలు ఏమిటి అనే కుతూహలము ఈ మిషనరీల వల్లనె నాలో కలిగింది. ” 

ఆయన పాశ్చాత్య తత్వవేత్తల గురుంచి అయితే ఈ క్రింది విధంగా విమర్శించారు, ” పాశ్చాత్య తత్వవేత్తలు తమకు తాము చాలా హేతుబద్ధంగా వాదిస్తున్నామని చెబుతారు గాని నిజానికి వారి వాదన వారి క్త్రైస్తవ మత రంగు పూసుకొని ఉంటుంది “.

శ్రీ రాధాకృష్ణయ్య గారి జన్మ దినమైన సెప్టెంబర్ 5 వ తారీఖున భారత దేశం ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటుంది.

శ్రీ రాధాకృష్ణయ్య గారు మద్రాసు ప్రసిడెన్సీ కాలేజీ లోను, కలకత్త యూనివర్సిటీ లోను, హార్రీస్ మాంచెస్టర్ కాలేజీ ( ఆక్స్ ఫర్డ్ ), మైసూర్ యూనివర్సిటి లలో ఉపన్యాసకులుగా పనిచేశారు. 

ALSO READ

ఈ పేజీలు  కూడా చదవండి

మహాత్మా గాంధీ 1869-1915

జవహర్‌లాల్ నెహ్రూ 1889-1940

మోక్షగుండం విశ్వేశ్వరయ్య

మన ఆంధ్ర యూనివర్సిటీ ప్రారంభించడానికి ఆయన్ కృషి చాల ఉంది. కట్టమంచి రామలింగారెడ్డి గారు ఆయన కలసి ఆంధ్ర యూనివర్సిటి రావడానికి కృషి చేశారు. తొలుత విజయవాడలోను తరువాత గుంటూరులోను తొలి ఆంధ్ర యూనివర్సిటీని నిర్వహించారు. తరువాత విశాఖపట్టణానికి తరలించారు. 

1949 నుండి 1952 వరకు సోవియట్ యూనియన్ కు భారత దేశము తరపున అంబాసడర్ గా ఉన్నారు. రాజ్యాంగ పరిషత్ కు సభ్యుడుగా కూడా ఉన్నారు.

1962 లో భారత గణతంత్ర రాజ్యమునకు (రెండవ) అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు.

నా ఈ వ్యాసాలను కూడా చదవండి

ALSO READ

Scroll to Top