జంబుద్వీపం

జంబుద్వీపం అంటే అది ఒక ద్వీపము కాదు ద్వీపకల్పము కాదు…..ప్రస్థుతము ఉత్తరభారత దేశములో అయోధ్య మరియు కాశి నగరములు ఉంటాయి. ఈ అయోధ్యకు గాని, కాశి నగరమునకు గాని దక్షిణములో ఎక్కడా ఎడారి కాన రాదు. ఇప్పుడే కాదు చరిత్రలో ఎప్పుడూ ఇక్కడ ఎడారి ఉన్న దాఖలాలు లేవు. ప్రస్తుతము హరప్పా కు దక్షిణముగా గల  గన్వేరివాలా ప్రాంతములోనే ఎడారి కానవస్తుంది. ప్రస్తుతము ఈ ఎడారి పేరు చోలిస్థాన్. గన్వేరివాలాలో త్రవ్వకాలు జరిగి అక్కడ లభించబోయే పురావస్తువులు పరిశోధించి కాల నిర్ణయము చేసి, అక్కడ విలసిల్లిన ప్రచీన సాంస్కృతిక, సామాజిక అంశములను విశ్లేషించిన  తరువాత గాని మనము పూర్తిగా ఒక అవగాహనకు రాలేము. ఇక పైన జరిపిన చర్చల ఆధారముగా మనము గన్వేరీవాలాను పూర్వపు వైజయంతముగాను, మత్స్య దేశ రాజధాని గాను, త్రిపురలలో ఒకానొక పురముగాను, బ్రహ్మ లోకముగాను గుర్తించవచ్చు.

( ఈ పాఠము నేను పరిశోధించి రచించిన “పాచీన భారతీయులకు అక్షర సుమాంజలి ” అను పుస్తకములోనిది. అధ్యాయము  15,  వైజయంతము’)

….ఈ క్రింది శ్లోకము పంచౌదన యజ్ఞమునకు సత్యలోకమును ముఖముగా వర్ణిస్తుంది.

బ్రహ్మాస్య శీర్షం బృహదస్య పృష్ఠం వామదేవ్యముదరమోదనస్య

ఛన్దాంసి పక్షౌ ముఖమస్య సత్యం విష్టారీ జాతస్తపసో ధి యజ్ఞః

(శ్లోకం   853,  సూక్తం   34, కాండ   4 )

Book “ప్రాచీన భారతీయులకు అక్షర సుమాంజలి (వేద కాల సమాజము)”
Book “ప్రాచీన భారతీయులకు అక్షర సుమాంజలి (వేద కాల సమాజము)”

నా ఈ పుస్తకమును చదువదలచిన వారు నా సెల్ ఫోన్ నంబర్ 9866357268 కు Phone Pay ఫోన్ పె ద్వారా రు. 450/- పంపించి పోస్టల్ అడ్రసు తెలియ జేస్తూ వాట్మెసాప్ మెసేజ్ పెడితే పోస్ట్ ద్వారా పుస్తకము పంపబడును.

లేదా

పుస్తకమును Amazon అమెజాన్ ద్వారా కొనుగోలు చేయుటకు ఈ లింకు పై క్లిక్ చెయ్యండి. https://www.amazon.in/dp/B0CTSP19X3?ref=myi_title_dp అమెజాన్ ద్వారా వెల రు. 450/-

ఓదనమునకు బ్రహ్మ శీర్షము, బృహత్తు వీపు, వామదేవుడు ఉదరము. యజ్ఞమునకు ఛందస్సు ప్రక్కటెముకలు, ముఖము సత్యము, విస్తరి తపస్సు. అందుచేత యజ్ఞనిర్వహణ సత్యలోకమయిన ప్రస్తుత గన్వేరీవాలాలోనే ప్రారంభమయి ఉండాలి.

నా వీడియోలను యుట్యుబ్ లో తిలకించండి

ఋక్షబిలమే జంబుద్వీపమా?

  మత్స్య దేశ ప్రతిపత్తి, ఖ్యాతి ద్వాపర యుగాంతములో జరిగిన మహాభారతయుద్ధము వరకు కొనసాగుతూనే ఉంది.

 (రామాయణము త్రేతా యుగమధ్యలో జరిగిన కథ.) భారతములోని కురు మహారాజు అయిన శంతనుడు మత్స్యగంధిని వివాహము చేసుకుంటాదు.  మత్స్యగంధి అంటె ఏదో పల్లెవారి పిల్ల అన్నట్లు కథలో చెబుతారు. కాని వాస్తవానికి శంతనుని వివాహమాడిన మత్స్యగంధి మత్స్యదేశపు రాజు కుమార్తె అయి‌ఉంటుంది. అలాగే అర్జనుడు ద్రౌపదిని మత్స్యయంత్రమును ఛేదించి గెలుచుకుంటాడు. అంటే పాంచాలి వాస్తవానికి వీర మత్స్య రాజ్య కన్య అని గ్రహించాలి.

నా ఈ వ్యాసాలను కూడా చదవండి

శ్రీ కృష్ణుడు శమంతక మణిని వెతుక్కుంటూ జాంబవంతుని గుహలో ప్రవేశిస్తాడు. అక్కడ జాంబవంతుని ఓడించి సత్యభామను చేపడతాడు. బ్రహ్మలోకమునకే మత్స్య దేశమని, సత్యలోకమని పేర్లు కలవు. అందుచేత సత్యభామ అంటే సత్యలోO మత్స్య కన్య అని అర్ధముచేసుకోవాలి. ఇక రామాయణములో వానరులకు దండకారణ్యములో కనబడిన పట్టణము పేరు ఋక్షబిలము. ఋక్షము అంటే ఎలుగుబంటి. జాంబము అన్న ఎలుగుబంటేనే. అలా ఋక్షబిలము అంటే జంబుద్వీపమని అనుకోవచ్చు.

సప్త సింధు అధ్యాయములో శుతుద్రినది గమన గతి మారిన తరువాత ఘగ్గర్ నది ఎండిపోయినదని తెలుసుకున్నాము కదా. ఆ తరువాత ఈ నదిని ఆనుకొని ఉండే ఆవాసముల వారు కొంతకాలము నదీ గర్భములో నూతులు త్రవ్వుకొని కాలము గడిపారు. 

భగీరథుడు గంగను భువి నుండి దివికు తెచ్చిన తరువాత మత్స్యదేశ వాసులు పూర్తిగా ప్రస్తుత ఉత్తర భారతదేశములోని గంగా నది ప్రాంతమునకు వలసవెళ్ళిపోయారు.

Jambavanta of Mahabharata
Jambavanta of Mahabharata

    రామాయణములోని ఋక్షబిల ప్రసక్తి జాతక కథలు ఈ పరిస్థితినే ప్రతిబింభిస్తున్నాయి. ఋక్షమన్న, జాంబము అన్న అది ఎలుగుబంటినే. ఆ ప్రాంతమును జనులు విడచిపెట్టిన తరువాత ఆ శిధిలములలో ఎలుగుబంట్లు ఆవాసము ఏర్పాటు చేసుకొని ఉండి ఉంటాయి. అయితే మత్స్య దేశమే బ్రహ్మలోకము కదా, అదే సత్యలోకము కదా, అది ఇప్పుడ….

ఈ పేజీలు  కూడా చదవండి